Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ధనుష్ ‘నేనే వస్తున్నా’ చిత్రం నుండి “వీరా సూర ధీర రారా” సాంగ్ రిలీజ్

తమిళ్ స్టార్‌ హీరో ధనుష్‌ నటించిన లేటెస్ట్‌ మూవీ ‘నానే వరువెన్’. ఈ సినిమా చిత్రీకరణ పూర్తి చేసుకుని రిలీజ్‌కు రెడీగా ఉంది. ఈ మూవీకి సెల్వ రాఘవన్‌ దర్శకత్వం వహించారు. ఇప్పటికే ‘నానే వరువెన్’ నుంచి రిలీజైన పోస్టర్లు, పాటలు సినిమాపై మంచి అంచనాలను నెలకొల్పాయి. ఈ చిత్రాన్ని తెలుగులో ప్రముఖ బ్యానర్ గీతా ఆర్ట్స్ సమర్పిస్తుంది. “నేనే వస్తున్నా” పేరుతో ఈ చిత్రం తెలుగులో రిలీజ్ కానుంది. తాజాగా ఈ చిత్రం నుండి “వీరా సూర ధీర రారా” పాటను రిలీజ్ చేసింది చిత్ర బృందం. ఈ పాటను చంద్రబోస్ రచించారు.
“వీరా సూర ధీర రారా
మతి బెదర
గతి చెదర
అడవంతా నీ అధికారం ఔరా”
లాంటి లైన్స్ ధనుష్ కి ఎలివేషన్ తో పాటు ఆకట్టుకుంటున్నాయి.

చంద్రబోస్ రాసిన ఈ పాటను రాహుల్ నంబియార్ ఆలపించారు. ఈ చిత్రానికి యువన్ శంకర్ రాజా సంగీతం అందిస్తున్నారు. “కాదల్ కొండేన్”, “పుదుపేట్టై”, “మయక్కం ఎన్న” తర్వాత ధనుష్ మరియు సెల్వరాఘవన్ కలయికలో వస్తున్న నాల్గవ చిత్రం కావడంతో ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. వి క్రియేషన్స్ బ్యానర్ పై  “కలైపులి ఎస్ థాను” నిర్మించిన ఈ చిత్రాన్ని తెలుగులో అగ్ర నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యాన‌ర్‌పై అల్లుఅర‌వింద్ విడుద‌ల చేస్తున్నారు. నటీనటులు: ధనుష్, ఎల్లి అవ్రామ్, ఇందుజా రవిచంద్రన్, యోగిబాబు మరియు యోగిబాబు సాంగ్ క్రెడిట్స్: రచన: చంద్రబోస్ సింగర్: రాహుల్ నంబియార్  టెక్నికల్ టీమ్: కథ: సెల్వరాఘవన్, ధనుష్ దర్శకుడు: సెల్వ రాఘవన్ బ్యానర్: వి క్రియేషన్స్ నిర్మాత: కలై పులి ఎస్ థాను సమర్పణ: గీతా ఆర్ట్స్ సినిమాటోగ్రఫీ: ఓం ప్రకాష్ సంగీతం: యువన్ శంకర్ రాజా ఎడిటింగ్: భువన్ శ్రీనివాసన్ PRO: ఏలూరుశ్రీను , మేఘశ్యామ్

Related Posts

Latest News Updates