Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభా సభ్యత్వం రద్దు… తదుపరి సీఎం ఎవరో?

జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్ శాసనసభా సభ్యత్వం రద్దైంది. అక్రమ మైనింగ్ కేసులో ఆయనపై వచ్చిన ఆరోపణలు నిజమేనని తేలడంతో ఆయన శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేయాలంటూ కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర గవర్నర్ రమేశ్ బయాస్ కు సిఫార్సు చేసింది. దీంతో సోరెన్ శాసనసభా సభ్యత్వాన్ని రద్దు చేస్తున్నట్లు గవర్నర్ అధికారికంగా ప్రకటించారు. తనకు తానే గనుల కేటాయింపు చేసుకున్నారని, దీని ద్వారా సీఎం సోరెన్ అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారంటూ బీజేపీ నేతలు గవర్నర్ కి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదును పరిగణనలోకి తీసుకున్న గవర్నర్… దీనిని కేంద్రాన్ని విన్నవించారు. వెంటనే కేంద్రం కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. ఈ నేపథ్యంలో విచారించిన ఎన్నికల సంఘం.. హేమంత్ సోరెన్ కు సంబంధించిన లీజులు, షెల్ కంపెనీల్లో ఆయన, ఆయన సన్నిహితుల వాటాలను తేల్చింది. ఆరోపణలు రుజువు కావడంతో ఆయన సభ్యత్వ రద్దుకు గవర్నర్ కు సిఫార్సు చేసింది.

 

సోరెన్‌పై అనర్హత వేటు వేసినా.. ఝార్ఖండ్‌లోని యూపీఏ సర్కారుకు ఢోకా లేదని కాంగ్రెస్‌ నేత, మంత్రి అలంగీర్‌ ఆలమ్‌ అన్నారు. 81 సభ్యుల అసెంబ్లీలో విపక్ష బీజేపీకి 28 మంది సభ్యులున్నారని, తమ కూటమికి మేజిక్‌ఫిగర్‌ను మించి సీట్లున్నాయని చెప్పారు. అనర్హత వేటుపడ్డా.. హేమంత్‌ సోరెన్‌ సీఎంగా కొనసాగుతారని వ్యాఖ్యానించారు. జేఎంఎం అధికార ప్రతినిధి సుప్రియో భట్టాచార్య మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికైన సర్కారును కూల్చేందుకు బీజేపీ కుట్రలు మొదలయ్యాయని విమర్శించారు.

Related Posts

Latest News Updates