తనను అమెరికాకు అప్పగించేందుకు బ్రిటన్ ఇచ్చిన అనుమతిని నిలువరించాలని కోరుతూ వికీలీక్స్ వ్యవస్థాపకుడు జూలియన్ అసాంజె యురోపియన్ మానవ హక్కుల కోర్టు (ఇసిహెచ్ఆర్)కు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఒక లేఖ అందచేశారు. అసాంజె మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో వుంచుకుని ఆయనను అమెరికాకు అప్పగిస్తే ఆత్మహత్య చేసుకునే ప్రమాదముందంటూ తొలుత బ్రిటన్ న్యాయమూర్తి తిరస్కరించారు. కానీ అమెరికా అధికారులు పలు రకాలుగా హామీలివ్వడంతో బ్రిటన్ ప్రభుత్వం అప్పగింతకు అనుమతించింది. దీంతో ఆ నిర్ణయానిు వ్యతిరేకిస్తూ లండన్ హైకోర్టులో అసాంజె అప్పీల్ చేశారు. వచ్చే ఏడాది దీనిపై విచారణ జరుగుతుందని భావిస్తున్నారు.
