Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పార్క్‌ పార్క్‌కు ఓ థీమ్‌!

గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. తెలంగాణ హరితహారం ఐదో విడత కార్యక్రమంలో భాగంగా జీహెచ్‌ఎంసీ పచ్చదనాన్ని పెంపొందించే ప్రణాళికలు సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగా గ్రేటర్‌ హైదరాబాద్‌ పరిధిలో 47 హరితహారం పార్కులను తయారు చేయాలని తలపెట్టింది.
ఖైరతాబాద్‌లో 13 పార్క్‌లు..
ఇందులో భాగంగా జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ పరిధిలో 13 పార్కులను సిద్ధం చేసేందుకు ఇప్పటికే ప్రతిపాదనలు రూపొందించారు. ప్రతి పార్కును ఒక్కో థీమ్‌తో తీర్చిదిద్దాలని తలపెట్టారు. గ్రేటర్‌ పరిధిలో 47 పార్కులు సిద్ధం చేయనుండగా అందులో అతి ఎక్కువ హరితహారం థీమ్‌ పార్కులు ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలోనే ఉన్నాయి.
2–3 ఎకరాల్లో పార్క్‌లు..
ఎక్కడెక్కడ ఈ పార్కులను అభివృద్ధి చేయవచ్చో వాటి వివరాలను ఇప్పటికే సేకరించారు. ఒక్కో థీమ్‌ పార్కును 2–3 ఎకరాల విస్తీర్ణంలో తయారు చేయనున్నారు. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్‌ పరిధిలో ఇప్పటికే బటర్‌ఫ్లై పార్కు, డైనోసర్‌ పార్కు, జపనీస్‌ పార్కు, ఔషధ వనం, బాంబూ పార్కు ఉన్నాయి. ఇటీవలనే ఇంకుడు గుంతల పార్కును కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. పెద్దమ్మగుడి సమీపంలో తాబేలు పార్కును కూడా తయారు చేశారు. వీటికి తోడు మరో 13 థీమ్‌ పార్కులను తయారు చేయనున్నారు. హరితహారంలో భాగంగా కొత్త పార్కులను అందుబాటులోకి తీసుకురావాలని తలపెట్టారు. వీటి నిర్వహణను కూడా స్థానికుల భాగస్వామ్యంతో ముందుకు తీసుకెళ్లాలని యోచిస్తున్నారు. ఖైరతాబాద్‌ జోన్‌ పరిధిలో రూపుదిద్దుకోనున్న హరితహారం పార్కులో ఎక్కువగా బంజారాహిల్స్, జూబ్లీహిల్స్‌ ప్రాంతంలోనే గుర్తించారు. ప్రభుత్వ స్థలాలతో పాటు జీహెచ్‌ఎంసీ స్థలాలు ఇక్కడే ఎక్కువగా ఉండటంతో వీటిని వినియోగంలోకి తీసుకురానున్నారు. ఈ పార్కులను తయారు చేస్తే పర్యావరణ పరిరక్షణతో పాటు వాతావరణ సమతుల్యం దెబ్బతినకుండా ఉంటుందని యోచిస్తున్నారు.

Related Posts

Latest News Updates