Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ కరెంట్ చిచ్చు… మా బకాయిల సంగతేంటని తెలంగాణ ప్రశ్న

ఏపీ, తెలంగాణ మధ్య మళ్లీ కరెంట్ వార్ ప్రారంభమైంది. అయితే.. ఈ సారి కేంద్రం మధ్యలో వచ్చింది. ఏపీ విద్యుత్ డిస్కమ్ లకు చెల్లి్ంచాల్సిన 6,756.92 కోట్లను నెల రోజుల్లోనే చెల్లించాలని తెలంగాణ డిస్కమ్ లకు కేంద్రం ఆదేశించింది. రాష్ట్ర విభజన చట్టం సెక్షన్ 92 ప్రకారం.. తెలంగాణకు ఏపీ సరఫరా చేసిన విద్యుత్ కు గాను అసలు 3,441.78 కోట్లు, వడ్డీ 3,315.14 కోట్లు కలిపి మొత్తం 6,756.92 కోట్లను నెలలో చెల్లించాలని కేంద్రం ఆదేశించింది. ఇటీవల ఏపీ సీఎం జగన్ ఢిల్లీకి వెళ్లి, ప్రధాని మోదీతో భేటీ అయిన సందర్భంలో తెలంగాణ నుంచి రావాల్సిన విద్యుత్ బకాయిలపై క్లారిటీ ఇవ్వాలని సీఎం జగన్ ప్రధాని మోదీని కోరారు. ఈ సమావేశం తర్వాతే ఈ కదలిక వచ్చింది.

 

ఘాటుగా స్పందించిన మంత్రి జగదీశ్ రెడ్డి

ఏపీకి చెల్లించాల్సిన బకాయిలను వెంటనే చెల్లించాలని కేంద్రం తెలంగాణ డిస్కంలకు హుకూం జారీ చేయడంతో తెలంగాణ విద్యుత్ మంత్రి జగదీశ్ రెడ్డి స్పందించారు. తెలంగాణపై కేంద్రం కక్షపూరితంగా వ్యవహరిస్తోందని, రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాలని చూస్తోందంటూ దుయ్యబట్టారు. ఏపీ నుంచి తమకు రావాల్సిన 12,900 కోట్ల బకాయిలు రావాలని, కేంద్రం వద్ద స్పందించినా… ఉలుకూ పలుకూ లేదని మండిపడ్డారు. విద్యుత్, బకాయిలు, పీపీఏలలోనూ ఏపీ తమ రాష్ట్రానికి నష్టమే చేసిందని మంత్రి జగదీశ్ రెడ్డి మండిపడ్డారు. తెలంగాణలో విద్యుత్ కోతలు లేవని, సీఎం కేసీఆర్ సాధించిన విజయాలను ప్రధాని జీర్ణించుకోలేకపోతున్నారని జగదీశ్ రెడ్డి మండిపడ్డారు.

Related Posts

Latest News Updates