Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీఎం కేసీఆర్ పోటీ చేసినా విజయం నాదే

మునుగోడు ఉప ఎన్నికల్లో సీఎం కేసీఆర్‌ పోటీ చేసినా విజయం తనదేనని మాజీ ఎమ్మెల్యే కోటిరెడ్డి రాజగోపాల్‌ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. మునుగోడులో నిర్వహించిన బీజేపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. సీఎం కేసీఆర్‌కు దమ్ము, ధైర్యం ఉంటే ఉప ఎన్నికలో పోటీ చేయాలని సవాల్‌ విసిరారు. కేసీఆర్‌ నియంత పాలనను అంతమొందించేందుకే తాను ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన బీజేపీలో చేరానన్నారు. కేసీఆర్‌ కుటుంబసభ్యులు జైలుకు వెళ్లే రోజులు దగ్గరపడ్డాయని అన్నారు. ఇప్పటికే ఆయన కుమార్తె కవిత లిక్కర్‌ కేసులో దొరికపోయారన్నారు. రూ.లక్ష కోట్లకు పైగా దోచుకున్న కేసీఆర్‌తో పాటు ఆయన కుమారుడు, అల్లుడిని కూడా కేంద్ర హోంమంత్రి అమిత్‌షా త్వరలో జైలుకు పంపి తీరుతారని హెచ్చరించారు.

Related Posts

Latest News Updates