Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఫైబర్‌ సిమెంట్‌తో ఇంటి అందం రెట్టింపు

పండుగలు, శుభకార్యాలు వస్తున్నాయంటే చాలు ఇంటిని అందంగా అలంకరించుకుంటాం. కొత్త ఇంటి నిర్మాణంలోనే కాకుండా పాత ఇంటి రిపేరింగ్‌లోనూ కొత్త తరహా ట్రెండ్‌ కనిపిస్తుంది. అదే ఫైబర్‌ సిమెంట్‌ బోర్డ్స్‌!

మన్నిక, సౌందర్యం..
కలప లేదా కలప ఆధారిత ప్యానెల్స్‌తో పోలిస్తే ఫైబర్‌ సిమెంట్‌ బోర్డులు నాణ్యత, సౌందర్యం, మన్నికలోనూ ధృడంగా ఉండటంతో దీన్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారు.
ప్రత్యామ్నాయంగా వినియోగిస్తున్నారు. ఇప్పుడు ఎక్కువగా డిజైనర్లు, ఆర్కిటెక్ట్‌లు సరికొత్త నిర్మాణాల్లో వీటిని ఎక్కువగా వినియోగిస్తున్నారు. దీంతో ఫైబర్‌ సిమెంట్‌ బోర్డులకు డిమాండ్‌ పెరుగుతుంది.

ఇంటిరీయర్, ఎక్స్‌టీరియర్‌..
ప్రస్తుతం మార్కెట్లో ల్యాండ్‌ స్కేపింగ్‌ విభాగంలో మార్పులు శరవేగంగా వస్తున్నాయి. ఇంటీరియర్, ఎక్స్‌టీరియర్‌ ప్యానల్స్‌ విభాగంలో ఫైబర్‌ సిమెంట్‌ బోర్డ్స్‌ ఎంట్రీతో గృహ నిర్మాణాలు మరింత సర్వాంగ సుందరంగా మారాయి. ఫైబర్‌ సిమెంట్‌ బోర్డ్‌ల విభాగంలో ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌ సరికొత్త ఉత్పత్తులను తీసుకొచ్చింది. గదుల పార్టేషన్, సీలింగ్, ఫాస్కేడ్, కిచెన్‌ అప్లికేషన్స్, డోర్స్, డెకరేటివ్‌ ఇలా ప్రతి విభాగంలోనూ నూతన శ్రేణి ఉత్పత్తులున్నాయి. ప్రస్తుతం ఎవరెస్ట్‌ ఇండస్ట్రీస్‌కు రూర్కీ, నాసిక్‌ రెండు ప్రాంతాల్లో ఫైబర్‌ సిమెంట్‌ బోర్డ్స్‌ ఉత్పత్తి కేంద్రాలున్నాయి.

Related Posts

Latest News Updates