Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఎల్‌ఈడీ ఐడియా ఆకట్టుకుంటోంది

కేబీఆర్‌ పార్క్‌ జంక్షన్‌ వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన ఎల్‌ఈడీ స్టాప్‌లైన్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయింది. అంతేకాదండోయ్‌ మహారాష్ట్రలోని పుణే ట్రాఫిక్‌ పోలీసుల్నీ ఆకట్టుకుంది. అక్కడ రెండు జంక్షన్లలో ఈ తరహావి ఏర్పాటు చేయాలని పుణే ట్రాఫిక్‌ విభాగం డిప్యూటీ కమిషనర్‌ ఆఫ్‌ పోలీసు పంకజ్‌ దేశ్‌ముఖ్‌ నిర్ణయించారు.
అమితాబ్‌ ప్రశంసలు..
కేబీఆర్‌ పార్క్‌ వద్ద ఏర్పాటు చేసిన ఈ టెక్నాలజీని నగరం మొత్తం విస్తరించాలంటే ఇండియన్‌ రోడ్‌ కాంగ్రెస్‌ (ఐఆర్‌సీ) అప్రూవల్‌ అవసరం. దీంతో ప్రయోగాత్మంగా ఏర్పాటు చేసిన సంస్థ ఐఆర్‌సీతో సంప్రదింపులు జరుపుతోంది. సోషల్‌మీడియాలో వైరల్‌గా మారిన కేబీఆర్‌ పార్క్‌ ఎల్‌ఈడీ స్టాప్‌లైన్‌ను ట్విట్టర్‌ వేదికగా బిగ్‌ బీ అమితాబ్‌ బచ్చన్‌ సైతం అభినందించారు.
సిగ్నల్స్‌కు బదులుగా..
సిటీలో ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ వద్ద అనేక మంది ఓ ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. కచ్చితంగా నిబంధనలు పాటించే వారైనా, తమ తప్పు లేకపోయినా స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌ అంటూ జరిమానాతో పాటు పెనాల్టీ పాయింట్‌ తప్పట్లేదు. ఓ రోడ్డుపై వివిధ చోట్ల ప్రయాణించే వాహనచోదకుడికి ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ కనిపించకపోవడమే దీనికి కారణం. ప్రత్యేక ఏర్పాట్లు ఉన్నచోట్ల మినహామిస్తే సాధారణంగా జంక్షన్లలో కుడివైపునే సిగ్నల్స్‌ ఉంటున్నాయి. దీంతో ఎడమ వైపుగా వెళ్ళే వారికి పక్కగా భారీ వాహనం ఉండే సిగ్నల్‌ వారికి కనిపించే అవకాశం ఉండట్లేదు. దీంతో రెడ్‌ సిగ్నల్‌ పడిన విషయం గుర్తించలేక స్టాప్‌లైన్‌ క్రాసింగ్‌కు పాల్పడుతున్నారు. ఫలితంగా కేవలం జరిమానా విధింపే కాకుండా కొన్నిసార్లు ప్రమాదాలకు కారకం అవుతోంది. మరోపక్క రోడ్దు దాటే పాదచారులకు జీబ్రా లైన్స్‌ సైతం పూర్తి పాదర్శకంగా ఉండట్లేదు. పగటి వేళల్లోనే వీటిని గుర్తుపట్టడం కష్టసాధ్యంగా మారింది. అలాంటప్పుడు రాత్రిపూట రోడ్డు దాటే పాదచారులకు మరింత ఇబ్బందికరం అవుతోంది.
వినూత్న ఆలోచన..
నగర ట్రాఫిక్‌ విభాగం అధికారులు ట్రాఫిక్‌ సిగ్నల్స్‌ ఉండే జంక్షన్ల వద్ద ప్రత్యామ్నాయాలకు అన్వేషించారు. ఈ నేపథ్యంలోనే ఓ ప్రైవేట్‌ సంస్థ ట్రాఫిక్‌ పోలీసుల్ని సంప్రదించింది. ఎల్‌ఈడీ లైట్లతో కూడిన స్టాప్‌లైన్లు ఏర్పాటు ప్రతిపాదనలు చేసింది. ప్రయోగాత్మకంగా కేబీఆర్‌ పార్క్‌ చౌరస్తా వద్ద అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో కేవలం సిగ్నల్‌ లైట్లు మాత్రమే కాకుండా స్టాప్‌లైన్‌ కూడా ఏ రంగు సిగ్నల్‌ ఉందో చూపే విధంగా దీన్ని డిజైన్‌ చేశారు. ఇలా చేస్తే లైట్లు కనిపించకున్నా స్టాప్‌లైన్‌ను చూసైనా ముందుకు వెళ్ళోచ్చా? లేదా? అనేది వాహనచోదకులు నిర్థారించుకుంటున్నారు. దీంతో సిగ్నల్‌ స్తంభానికి అనుసంధానిస్తూ ఆ రహదారిపై స్టాప్‌లైన్‌ స్థానంలో ఎల్‌ఈడీ లైట్లు ఉంటున్నాయి. వాహనాలు దీనిపై నుంచి వెళ్ళినా ఎలాంటి ఇబ్బంది లేకుండా జాగ్రత్తలు తీసుకుంటూ మెటీరియల్‌ ఎంపిక చేశారు. ఫలితంగా రెడ్‌ సిగ్నల్‌ పడితే ఈ ఎల్‌ఈడీ లైట్లు ఆ రంగులో, గ్రీన్‌ పడితే ఆ రంగులోకి మారతాయి. రాత్రి వేళల్లో ఇవి అత్యంత ఆకర్షణీయంగా కనిపిస్తున్నాయి.
ఎంత ఖర్చు అవుతుంది…
ఈ ఎల్‌ఈడీ లైన్‌ ఏర్పాటు చేయడానికి మీటర్‌కు రూ.6,500 వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం ప్రయోగాత్మకంగా కేబీఆర్‌ చౌరస్తా వద్ద సిగ్నల్‌కు ఏర్పాటు చేశారు. సోషల్‌మీడియా ద్వారా ఇది వైరల్‌ కావడంతో దేశంలోని అనేక నగరాలకు చెందిన ట్రాఫిక్‌ పోలీసుల దృష్టి దీనిపై పడింది. తాజాగా మహారాష్ట్రలోని పుణేలో ఉన్న రెండు జంక్షన్లలో దీన్ని ఏర్పాటు చేయాలని అక్కడి ట్రాఫిక్‌ పోలీసులు నిర్ణయించారు. ప్రయోగాత్మకంగా పుణేలోని నటరాజ్‌ చౌక్, బుధ్‌వార్‌ పేట్‌ చౌక్‌ల్లో ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. తమిళనాడులోని కొయంబత్తూర్‌కు చెందిన ఓ సంస్థ వీటిని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చింది. అక్కడి రెండు జంక్షన్లలో రూ.4.75 లక్షల ఖర్చుతో ఈ ఎల్‌ఈటీ వ్యవస్థ అందుబాటులోకి రానుంది. ఇటు నగరంలో కానీ అటు పుణేలో కానీ ఈ ఎల్‌ఈటీ స్టాప్‌లైన్‌ వ్యవస్థను విస్తరించాలంటే ఐఆర్‌సీ అప్రూవల్‌ అవసరం. దేశంలో ఎక్కడైనా రహదారి నిర్వహణ, ట్రాఫిక్‌ సిగ్నలింగ్‌ వ్యవస్థలో మార్పుచేర్పులు చేయాలంటే ఐఆర్‌సీ అనుమతి ఉండాల్సింది. ఎవరైనా చేపట్టిన/చేపట్టనున్న ప్రయోగానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని ఐఆర్‌సీకి పంపిస్తారు. ఆ విధానం, అందువల్ల కలిగే లాభాలు, లోపాలు తదతరాలను అధ్యయనం చేసిన తర్వాత ఐఆర్‌సీ తగు సూచనలు చేస్తూ గైడ్‌లైన్స్‌ జారీ చేస్తుంది. ఆ తర్వాతే కొత్త విధానం పూర్తిస్థాయిలో అమలు చేయడానికి ఆస్కారం ఉంటుంది. నగరానికి సంబంధించి కేబీఆర్‌ పార్క్‌ వద్ద ప్రయోగాత్మకంగా ఏర్పాటు చేసిన సంస్థే ఐఆర్‌సీ అప్రూవల్‌ కోసం ఆ విభాగంతో సంప్రదింపులు జరుపుతోంది.
హైదరాబాద్‌లోని ఎల్‌ఈడీ ఐడియా.. పుణేలో అమలు!

Related Posts

Latest News Updates