జీహెచ్ఎంసీ భవనాలకు త్వరలో సోలార్ విద్యుత్‌ను వినియోగించుకోనున్నారు. ఇందుకుగాను అవసరమైన విద్యుత్ ఉత్పత్తికి రూఫ్‌టాప్ గ్రిడ్ కనెక్డెడ్ ప్లాంట్లను జీహెచ్ఎంసీ భవనాలపై ఏర్పాటు చేయనున్నారు. సోలార్ విద్యుత్ వల్ల గ్రీన్ అండ్ క్లీన్ కరెంట్‌ను ప్రోత్సహించడంతోపాటు జీహెచ్ఎంసీ విద్యుత్ ఖర్చుల భారం కూడా తగ్గనుంది. జీహెచ్ఎంసీకి గ్రేటర్ వ్యాప్తంగా ఎన్నో భవనాలున్నాయి. వీటి రూఫ్‌లపై సోలార్ విద్యుత్ ప్లాంట్ల ఏర్పాటుకు సర్వే కోసం జీహెచ్ఎంసీ టెండర్ల ద్వారా ది ఎనర్జీ అండ్ రిసోర్స్ ఇనిస్టిట్యూట్(టెరి)ని ఎంపిక చేసింది. వివిధ జోన్లలో 58 భవనాల్లో సర్వే నిర్వహించిన టెరి వాటిల్లో 48 భవనాలపై విద్యుత్ ఉత్పత్తికి ఫీజిబిలిటీ ఉందని నివేదించింది. అన్ని భవనాలపై వెరసి మొత్తం 15,557 చ.మీ.ల స్థలంలో 941 కేడబ్లు్యపి సామర్ధ్యంతో ఏడాదికి 15.60 లక్షల విద్యుత్‌ను ఉత్పత్తి చేయవచ్చునని పేర్కొంది. ఇందుకుగాను రెండు పద్ధతులను పరిగణనలోకి తీసుకున్నారు.
రెస్కో మోడల్:
ఈ పద్ధతిలో జీహెచ్ఎంసీ ఎలాంటి వ్యయం చేయనవసరం లేదు. ప్లాంట్ల ఏర్పాటుతోపాటు 25 సంవత్సరాల వరకు నిర్వహణను కూడా కాంట్రాక్టు పొందే ఏజెన్సీయే చేస్తుంది. ఉత్పత్తి చేసిన యూనిట్లకు జీహెచ్ంఎసీ సదరు సంస్థకు చెల్లిస్తుంది.ఉత్పత్తి ధర సాధారణ విద్యుత్‌కంటే దాదాపు సగం తక్కువే అయినప్పటికీ ఈ ఒప్పందం 25 సంవత్సరాల వరకు అమలులో ఉండటంతో అన్నేళ్లపాటు ప్లాంట్లు ఏర్పాటుచేసే భవనాల రూఫ్‌లలో ఎలాంటి మార్పులు చేయరాదు. భవానలను కూల్చివేయరాదు. అదనపు అంతస్తులు నిర్మించాలనుకున్నా ప్లాంట్ షిప్టింగ్చార్జీలు, ఉత్పత్తిలో జరిగే నష్టాన్ని జీహెచ్ఎంసీయే భరించాలి.
కేపెక్స్ మోడల్:
ఈ మోడల్లో పెట్టుబడి వ్యయాన్ని జీహెచ్ఎంసీ భరించాలి. అయితే టీఎస్ఆర్ఈడీసీఓనుంచి 25 శాతం సబ్సిడీ లభిస్తుంది. ఏటా కచ్చితంగా 1500 యూనిట్లు/కేడబ్లు్యపీకి కాంట్రాక్టు ఏజెన్సీ గ్యారంటీ ఇస్తుంది. ఒకవేళ ఉత్పత్తి చేయకుండే దానికి పెనాల్టీ విధించవచ్చు. ఐదేళ్లపాటు నిర్వహణ చార్జీలు కూడా కాంట్రాక్టు ఏజెన్సీవే. రెండింటినీ చర్చించిన జీహెచ్ఎంసీ స్టాండింగ్ కమిటీ కేపెక్స్ మోడల్‌కు ఆమోదం తెలిపింది. ఈ విధానంలో పెట్టుబడి వ్యయం రూ.4.66 కోట్లు కాగా, అందులో రూ.1.16 కోట్లు సబ్సిడీగా పోను దాదాపు రూ.3.5 కోట్లు వ్యయమవుతుంది. విద్యుత్ ఉత్పత్తి వల్ల 30 నెలల్లోనే ఈమొత్తం తిరిగి జీహెచ్ఎంసీకి సమకూరుతుందని సంబంధిత అధికారి తెలిపారు.సోలార్‌పవర్ వల్ల విద్యుత్ఖర్చులు తగ్గడమే కాకుండా పర్యావరణహితం కూడా కావడంతో జీహెచ్ఎంసీ ఇందుకు సిద్ధమైంది.త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయి.