హైదరాబాద్‌లోని తాజ్‌జీవీకే హోటల్స్ విక్రయానికి పెట్టారా? పరిణామాలు చూస్తుంటే నిజమే అనిపిస్తుంది! సింగపూర్ గవర్న్మెంట్ ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్ (జీఐసీ) తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్‌లో వాటాను కొనుగోలు చేయనున్నట్లు తెలిసింది. ఈ మేరకు తాజ్ జీవీకే ప్రమోటర్లతో చర్చలు చేస్తున్నట్లు సమాచారం.
తాజ్, జీవీకే గ్రూప్‌ల జాయింట్ వెంచరే..
ముంబైకి చెందిన ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్‌సీఎల్), హైదరాబాద్‌కు చెందిన జీవీకే గ్రూప్‌ల జాయింట్ వెంచరే తాజ్ జీవీకే హోటల్స్ అండ్ రిసార్ట్స్ లిమిటెడ్ (తాజ్ జీవీకే). 2010లో ప్రారంభమైన తాజ్ జీవీకేలో ఇరు కంపెనీలకు తలా 25.52 శాతం వాటాలున్నాయి. 23.9 శాతం వాటాలు జీవీకే గ్రూప్‌లో వ్యక్తిగత ఇన్వెస్టర్లకు ఉన్నాయి. ప్రస్తుతం తాజ్జీవీకేకు దేశంలోని ప్రధాన మెట్రో నగరాల్లో 7 ఫైవ్ స్టార్ హోటల్స్ ఉన్నాయి. ఇందులో హైదరాబాద్‌లో తాజ్ కృష్ణా, బంజారా, డెక్కన్, వివంత నాలుగు హోటల్స్ ఉండగా.. చండీఘడ్‌లో తాజ్ చండీఘడ్, చెన్నైలో తాజ్ క్లబ్ హౌజ్, ముంబైలో తాజ్ శాంతాక్రూజ్ ఉన్నాయి.
రుణ భారాన్ని తగ్గించుకునేందుకే..
జీవీకే రుణ భారాన్ని తగ్గించుకునేందుకు తాజ్ జీవీకే హోటల్స్‌లో వాటాను విక్రయించనున్నట్లు తెలిసింది. జీవీకే గ్రూప్ ఎలాగైతే ముంబై ఎయిర్పోర్ట్ నిర్వహణ వాటాను విక్రయించిందో అదే విధంగా తాజ్ జీవీకే హోటల్స్‌లో తన వాటాను విక్రయించాలని నిర్ణయించినట్లు సమాచారం. మార్చి 31 నాటికి జీవీకే నికర రుణాలు రూ.11,458 కోట్లుగా ఉన్నాయి. తాజ్ జీవీకే మార్కెట్ క్యాప్టలైజేషన్ రూ.1,182.86 కోట్లుగా ఉంది. ఇందులో జీవీకే వాటా రూ.307.5 కోట్లుగా ఉంటుంది.