Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

నిర్మాణంలో జిలిటెన్‌స్టిక్‌ వినియోగం

అనుమతులు లేకుండా ఇంటి నిర్మాణలో జిలిటెన్‌స్టిక్‌ వినియోగించడంతో  పేలుళ్ల దాటికి  జనం తీవ్ర భయందోళనకు గురైన సంఘటన సైదాబాద్‌లో చోటుచేసుకుంది. సైదాబాద్‌ డివిజన్‌ ఎల్‌ఐసీ కాలనీ బస్‌స్టాప్‌ సమీపంలో వీఐపీ స్కూల్‌ నిర్వాహకులు అహ్మద్‌ఖాన్‌ బహుళ అంతస్థుల నిర్మాణంలో భాగంగా పనిని బిల్డర్‌కు అప్పగించాడు. ఈ సందర్భంగా నిర్మాణంలో వచ్చిన బండ రాళ్లను పగుల గొట్టడానికి ఏలాంటి అనుమతులు లేకుండానే సదరు బిల్డరు జిలిటెన్‌ స్టిక్‌ వినియోగిస్తున్నారు. దీంతో అక్కడి నుంచి వస్తున్న పేలుళ్ల దాటికి చుట్టు పక్కల ఇళ్ల జనం భయటకు పరుగులు తీశారు. ఇంట్లో కిటికీలు, అద్దాలు పగిలిపోయాయి. దీంతో స్థానికలు అక్కడికి వెళ్లి ఎందుకు మందుగుండు సామాగ్రి వినియోగిస్తున్నారని ప్రశ్నించడంతో బిల్డర్‌ అనుచరులు చితకబాదారు. సైదాబాద్‌ పోలీస్‌స్టేషన్‌లో ఈ విషయమై స్థానికులు సాయి ఫిర్యాదు చేయగా పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని నిర్మాణాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

Related Posts

Latest News Updates