Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

పద్మభూషణ్ అవార్డును అందుకున్న గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్

గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ప్రతిష్ఠాత్మక పద్మభూషణ్ అవార్డు అందుకున్నారు. అమెరికాలోని భారత రాయబారి తరణ్ జిత్ సింగ్ సంధు నుంచి పిచాయ్ ఈ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా పిచాయ్ మాట్లాడారు. భారత్ తనలో అంతర్భాగమని, తాను ఎక్కడికి వెళ్లినా… భారత వారసత్వాన్ని తీసుకెళ్తానని ప్రకటించారు. ఈ అపారమైన గౌరవాన్ని కల్పించిన భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు ప్రకటించారు. భారత్ లో వస్తున్న అనేక ఆవిష్కరణలు ప్రపంచానికి మేలు చేస్తున్నాయని తెలిపారు. ప్రధాని మోదీ చేపట్టిన డిజిటల్ ఇండియా విజన్ అభివ్రుద్ధికి ఎంతో సహకరిస్తుందని తెలిపారు. ఈ యేడాది జనవరిలో కేంద్రం పద్మ అవార్డులను ప్రకటించింది. వాణిజ్యం, పరిశ్రమల విభాగంలో పిచాయ్ కు పద్మభూషణ్ వరించింది.

Related Posts

Latest News Updates