Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఖైరతాబాద్ వినాయకుడికి తొలి పూజ చేసిన గవర్నర్ తమిళిసై

వినాయక చవితిని పురస్కరించుకొని ఖైరతాబాద్ మహా గణనాథుడికి తెలంగాణ గవర్నర్ తమిళసై సౌందర రాజన్ తొలి పూజ చేశారు. మంత్రి తలసాని, స్థానిక ఎమ్మెల్యే దానం నాగేందర్, మేయర్ గద్వాల విజయ లక్ష్మితో కలిసి మహా హారతిలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు తెలిపారు. ఖైరతాబాద్ గణేష్‌ను దర్శించుకోవడం చాలా సంతోషంగా ఉందన్నారు. అందరిని ఐకమత్యంగా ఉంచేదే గణేష్ ఉత్సవాలు అని గవర్నర్ తమిళిసై పేర్కొన్నారు. ఈ సారి 50 అడుగుల భారీ విగ్రహాన్ని నిర్వాహకులు ఏర్పాటు చేశారు.

 

ఖైరతాబాద్ వినాయకుడు అత్యంత ప్రాశస్త్యం పొందిన వినాయకుడు. దీంతో పెద్ద ఎత్తున భక్తులు తరలివస్తున్నారు. వినాయకుడి దర్శనం చేసుకుంటున్నారు. భక్తుల సౌకర్యార్థం నిర్వాహకులు క్యూలైన్లను ఏర్పాటు చేశారు. ఇక.. పోలీసులు కూడా భారీ బందోబస్తునే ఏర్పాటు చేశారు. 9 ప్రధాన మెటల్ డిటెక్టర్స్‌తో క్షుణ్ణంగా తనిఖీ తరువాతే భక్తులకు స్వామి దర్శనానికి అనుమతి ఇస్తున్నారు.మూడు షిఫ్ట్‌లో 360 పోలీసులు విధులు నిర్వహిస్తున్నారు. క్రైమ్‌ టీమ్స్‌, షీటీమ్స్‌, సిటీ కమాండోస్, క్విక్ రియాక్షన్ టీంమ్స్, ఐడీ పార్టీలు, టీఎస్ పోలీస్ బెటాలియన్, రాపిడ్ యాక్షన్ ఫోర్స్ బృందాలతో పాటు షాడో టీంమ్స్ రంగంలోకి దిగాయి.

Related Posts

Latest News Updates