Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రాహుల్ రాజకీయాలకు పనికిరారు : గులాంనబీ ఆజాద్

కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసిన తర్వాత గులాంనబీ ఆజాద్ మొదటి సారి మీడియాతో మాట్లాడారు. అయితే… రాజీనామా సమయంలో రాహుల్ ను ఎంతనైతే విమర్శించారో…. ఈసారి అంత విమర్శలు చేయకపోవడం గమనార్హం. రాహుల్ గాంధీ మంచి వ్యక్తేనని, అయితే… రాజకీయాలకు మాత్రం ఏమాత్రం పనికిరారని గులాంనబీ ఆజాద్ అన్నారు. అయితే.. పార్టీ అత్యున్నత స్థాయి కమిటీ అయిన సీడబ్ల్యూసీ అనేది అర్థం పర్థం లేనిదని విమరంశించారు. గతంలో సీడబ్ల్యూసీలో సోనియా గాంధీ సభ్యులందర్నీ సంప్రదించి, నిర్ణయాలు తీసుకునేవారని గుర్తు చేశారు. కానీ.. రాహుల్ వచ్చిన తర్వాత 2004 నుంచి రాహుల్ పైనే ఆధారపడటంగా మారిపోయిందని మండిపడ్డారు. అందుకు రాహుల్ కు అర్హత లేదన్నారు. అయితే… తనకు రాహుల్ పై కోపమేమీ లేదని, ఆయన చాలా మంచి వ్యక్తి అని కితాబునిచ్చారు. ఎప్పుడూ తనకు మర్యాద ఇచ్చేవారని, కానీ.. ఆయనకు రాజకీయ వ్యక్తికి వుండాల్సిన లక్షణాలేవీ లేవన్నారు.

 

తాను కాంగ్రెస్‌ను వీడాలని పార్టీ పెద్దలు కోరుకున్నారని గులాం నబీ ఆజాద్‌ సంచలన వ్యాఖ్యలు చేశారు. తన అవసరం లేదని కాంగ్రెస్‌ అనుకుందని, అందుకే పార్టీని బలవంతంగా వీడాల్సి వచ్చిందని ఆరోపించారు. పార్టీలో సంస్థాగత మార్పులు కోరుతూ జీ-23 గ్రూప్‌లో చేరినప్పటి నుంచి కాంగ్రెస్‌ పార్టీకి తనతో సమస్య ఏర్పడిందని అన్నారు. తాను మోదీ ఏజెంట్‌ కాదని గులాం నబీ ఆజాద్‌ స్పష్టం చేశారు. లోక్‌సభలో మోదీని కౌగిలించుకున్నది రాహులా? నేనా అని ప్రశ్నించారు.

Related Posts

Latest News Updates