ప్రాచీన కాలంలో గోడలను సున్నం, బంక మట్టితో నిర్మించేవాళ్లు. కాలక్రమంలో వీటి స్థానంలో రెడ్ బ్రిక్స్ చేరాయి. ఇక ఇప్పుడు ఏఏసీ బ్లాక్స్, సాలిడ్ బ్రిక్స్, షేర్వాల్స్తో నిర్మాణాలు జరుగుతున్నాయి. రెడ్ బ్రిక్స్, ఏఏసీ, సాలిడ్, షేర్వాల్స్.. వేటితో నిర్మించే గోడలకైనా సరే ఇసుక, సిమెంట్‌తో ప్లాస్టరింగ్ తప్పనిసరి. ఈ రోజుల్లో నది ఇసుక దొరకడం ఎంత కష్టంగా ఉందో మనకు తెలిసిందే. సిమెంట్ ధర కూడా మండిపోతుంది. మరెలా? ఇసుక, సిమెంట్లకు ప్రత్యామ్నాయమే మినరల్ జిప్సం. దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ (ఐజీబీసీ) గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చింది.
అమెరికా, చైనా, ఆస్ట్రేలియా, సింగపూర్ వంటి అభివృద్ధి చెందిన దేశాల్లో 90 శాతం పైగా ప్లాస్టరింగ్‌ను మినరల్ జిప్సంతోనే చేస్తారు. మన దేశంలో నది ఇసుక కొరత కారణంగా రోబో శ్యాండ్ వినియోగం పెరిగింది. అయితే రోబో శ్యాండ్లో సిలికాన్ కంటెంట్ లేని కారణంగా గోడల్లో పగుళ్లు వస్తున్నాయి. దీంతో మినరల్ జిప్సం వైపు దృష్టి మళ్లింది. హైదరాబాద్, ముంబై, బెంగళూరు వంటి ప్రధాన మెట్రో నగరాల్లో నివాస, వాణిజ్య భవనాల ఇంటర్నల్ ప్లాస్టరింగ్ కోసం దీన్ని వినియోగిస్తున్నారు.
సాధారణంగా జిప్సం రెండు రకాలుగా ఉంటుంది. 1. కాంపోజిట్ జిప్సం 2. మినరల్ జిప్సం. మనకు మార్కెట్లో కనిపించే బ్రాండ్స్ కాంపోజిట్ జిప్సంలే. కాంపోజిట్ జిప్సం లో ప్లాస్టరింగ్ కి కావలసిన పటుత్వం ఉండదు. దీన్ని ఫాల్స్ సీలింగ్, పిఓపి పుట్టి మరియు రెడీమేడ్ వాల్స్ వంటి వాటిల్లో వినియోగిస్తారు. కాంపోజిట్ జిప్సమ్లో 50 మెష్ అనగా 150–300 మైక్రాన్ ఉంటుంది. మినరల్ జిప్సమ్లో మెష్ సైజు 200 అనగా 74 మైక్రాన్ ఉంటుంది. మైక్రాన్స్ ఎంత తక్కువగా ఉంటే అంత దఢత్వం ఉంటుంది. ‘ఏ’ కేటగిరి గనుల నుంచి వెలువడేదే మినరల్ జిప్సం (కాల్షియం సల్ఫేట్). మన దేశంలో ‘ఏ’ కేటగిరి గనులు లేవు. రాజస్థాన్‌లో ఉన్నా.. అవి ‘సీ’ కేటగిరీ గనులే. మెక్సికో, యూకే, సౌదీ, ఇరాన్, చైనా, స్పెయిన్, ఆస్ట్రేలియా వంటి దేశాల్లో ‘ఏ’ కేటగిరి గనులున్నాయి.
ప్లాస్టరింగ్ ఎలా చేస్తారంటే..
భూమి లోపల నుంచి జిప్సం గనులను తవ్వి.. వాటిని రాళ్లుగా ప్లాంట్ వద్దకు తరలిస్తారు. 800 ఫారన్ హీట్స్‌లో వేడి చేసి.. తెల్లటి పౌడర్లా తయారు చేస్తారు. దీన్ని 25, 50 కిలోల బ్యాగ్స్‌లో ప్యాకింగ్ చేసి విక్రయిస్తుంటారు. జిప్సం మిశ్రమాన్ని తగినంత నీటితో కలుపుకోవాలి. తెల్లగా పాల పౌడర్ లాగా ఉన్న మిశ్రమం.. కేక్‌లాగా మారుతుంది. దీన్ని అరగంటలోగా ప్లాస్టరింగ్ చేసేయాలి. లేకపోతే గడ్డ కడుతుంది.
రెడ్, సాలిడ్ బ్రిక్స్‌కు 12–15 ఎంఎం, ఏఏసీ బిక్స్‌కు 8–12 ఎంఎం, షేర్వాల్కు 6–8 ఎంఎం మందం ప్లాస్టరింగ్ అవసరం ఉంటుంది. జిప్సం ప్లాస్టరింగ్‌లో గల సౌలభ్యం ఏమిటంటే ఒకేసారి 3ఎం ఎం నుండి 30 ఎంఎం వరకు మందంతో ప్లాస్టరింగ్ చేయవచ్చు. ఇసుక సిమెంట్ ప్లాస్టరింగ్ లతో ఒకేసారి ఎక్కువ మందం ప్లాస్టరింగ్ చేయలేము, ఫస్ట్ కోటు దొడ్డు స్టాండ్ తోను సెకండ్ కోటు సన్న స్టాండ్ తోనూ చేయవలసి వస్తుంది. జిప్సమ్ ప్లాస్టరింగ్ వేసిన 72 గంటల తర్వాత ప్రైమర్ వేసి.. రంగులు వేసుకోవచ్చు. జిప్సంతో ప్లాస్టరింగ్ వేగంగా జరుగుతుంది. 4,500 చ.అ. గోడలకు ఇసుక, సిమెంట్‌తో ప్లాస్టరింగ్ చేయాలంటే 30 రోజులు పడితే.. జిప్సంతో 7 రోజుల్లో పూర్తవుతుంది. ఎస్ఎస్ఆర్ రేట్స్ ప్రకారం ఇసుక, సిమెంట్ ప్లాస్టరింగ్‌కు చ.అ.కు రూ.44. అయితే జిప్సంకు రూ.35 మాత్రమే ఉంటుంది.
ప్రయోజనాలేంటంటే?
– ఇసుక సిమెంట్ ప్లాస్టరింగ్ చేసిన ఇళ్లతో పోలిస్తే జిప్సంతో ప్లాస్టరింగ్ చేసిన ఇంట్లో వేడి 3 నుంచి 5 డిగ్రీలు తక్కువగా ఉంటుంది. దీంతో ఇంట్లో ఏసీ, ఫ్యాన్ వంటి విద్యుత్ ఉపకరణాల వాడకం తగ్గుతుంది. కరెంట్ బిల్లు తక్కువొస్తుంది.
– వాటర్ క్యూరింగ్ అవసరం ఉండదు. చ.అ. గోడకు జిప్సంప్లాస్టరింగ్ చేస్తే 5 లీటర్ల నీటిని ఆదా చేసినట్టే.
– జిప్సం ధ్వని తరంగాలను గ్రహిస్తుంది. ఇంట్లోకి ఎలాంటి శబ్ధాలు రాకుండా నిరోధిస్తుంది.
– గోడలకు ఎలాంటి పగుళ్లు రావు. దీర్ఘకాలం పాటు మన్నిక ఉంటుంది.
– గ్లాస్ మాదిరిగా మృధువుగా ఉంటుంది. తెల్లగా పాల వలే ఉంటుంది. ఎలాంటి రంగు మిశ్రమంలోనైనా ఇట్టే కలిసిపోతుంది.
– రెడ్, ఫ్లయాష్, ఏఏసీ, సాలిడ్ బ్రిక్స్, షేర్వాల్స్ ఎలాంటి గోడల మీదనైనా నేరుగా అప్లై చేసుకోవచ్చు.
– ప్రస్తుతం నిర్మాణ రంగంలో నైపుణ్యమున్న కార్మికుల కొరత తీవ్రంగా ఉంది. సాధారణంగా ఇసుక, సిమెంట్ మిశ్రమంతో గోడలకు ప్లాస్టరింగ్ చేయాలంటే ఒక కార్మికుడు రోజుకు 60–80 చ.అ. వరకు మాత్రమే చేయగలడు. అదే జిప్సం ప్లాస్టరింగ్‌తో రోజుకు 200 చ.అ. పని పూర్తవుతుంది. సమయం, డబ్బు రెండూ ఆదా ఐనట్టే.
– జిప్సం ప్లాస్టరింగ్ చేసిన ఇంట్లో అదనంగా పుట్టి పెట్టాల్సిన అవసరం లేదు.
తెలుగు రాష్ట్రాల్లో ఏకైక డిస్ట్రిబ్యూటర్..
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో మినరల్ జిప్సంను ‘ఎన్‌కేవీ’ బ్రాండ్ పేరిట డిస్రిబ్యూషన్ చేస్తున్న ఏకైక కంపెనీ పేకేటి వెంచర్స్. గత రెండేళ్లలో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడలలో 2 కోట్ల చ.అ. నివాస, వాణిజ్య సముదాయాల ప్రాజెక్ట్‌లను పూర్తి చేసింది. మై హోమ్, షాపూర్జీ పల్లోంజీ, ఫినిక్స్, ఎఫ్ హెచ్ డి, గిరిధారి హోమ్స్ వంటి ప్రముఖ నిర్మాణ సంస్థలు క్లయింట్లుగా ఉన్నారు. చెన్నైకి చెందిన ఎన్‌కేవీ హోమ్ డిపో అనే కంపెనీ సౌదీ, ఇరాన్ వంటి గల్ఫ్ దేశాల నుంచి జిప్సంను దిగుమతి చేసుకొని.. స్థానికంగా ఉన్న ప్లాంట్‌లో జిప్సం పౌడర్‌ను తయారు చేసి తెలుగు రాష్ట్రాలతో పాటూ ముంబై, మహారాష్ట్ర, గుజరాత్ వంటి రాష్ట్రాల్లో విక్రయిస్తుంటుంది.