Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

చేతనైతే సాయం చేయండి… అనవసర ఒత్తిడి కాదు

ప్రస్తుతం తరుణంలో శ్రీలంకు కావాల్సింది సాయమే గానీ మరో దేశ అజెండాను నెరవేర్చే అవసరం ఒత్తిడి, వివాదాలు కాదని భారత్‌ స్పష్టం చేసింది. శ్రీలంక అంతర్గత వ్యవహారాల్లో భారత్‌ జోక్యం చేసుకుంటోందని చైనా చేస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టింది.  ఈ మేరకు కొలంబలోని భారత హైకమిషన్‌ తెలిపింది. చైనా రాయబారి వ్యాఖల్ని ఖండిరచింది. ప్రాథమికమైన దౌత్య మర్యాదల్ని చైనా రాయబారి ఉల్లంఘించారని ఆక్షేపించింది. భారత్‌ అభ్యంతరాలపై  చైనా రాయబారి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎలాంటి ఆధారాలు లేకుండా భద్రతా పరమైన ఆందోళనలను లేవనెత్తటం బయటి నుంచి అవరోధం కలిగించటమేనన్నారు. అలాగే అది శ్రీలంక సార్వభౌమత్వం, స్వంతంత్రతలో కలుగజేసుకోవటమేనని భారత్‌పై ఆరోపణలు చేశారు. అయితే నౌకపై శ్రీలంక, చైనాలు ఉమ్మడిగా చర్చించి ఇరు దేశాల ప్రాంతీయ సమగ్రత, సార్వభౌమత్వం, స్వతంత్రతను కాపాడుకునేందకు నిర్ణయించటం సంతోషంగా ఉందన్నారు.

Related Posts

Latest News Updates