Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

యంగ్ హీరో రాజ్ తరుణ్ కొత్త మూవీ ”తిరగబడరా సామి” ప్రారంభం

”తిరగబడరా సామి” చిత్రం షూటింగ్ ప్రారంభమైంది. ఈ చిత్రం పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. నిర్మాత మండలి అధ్యక్షులు సి.కళ్యాణ్ క్లాప్ ఇవ్వగా, ప్రముఖ నిర్మాత కెఎస్ రామారావు కెమెరా స్విచ్ ఆన్ చేశారు, మరో ప్రముఖ నిర్మాత పోకూరి బాబూరావు స్క్రిప్ట్ ను దర్శకుడు ఎఎస్ రవికుమార్ చౌదరికి అందించారు. ఈ కార్యక్రమంలో దర్శకుల సంఘం అధ్యక్షుడు కాశీ విశ్వనాథ్, దర్శకుడు వీరశంకర్, గోసంగి సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. యంగ్ హీరో రాజ్ తరుణ్ కథానాయకుడిగా నటిస్తున్న కొత్త చిత్రం ‘తిరగబడరా సామి’. ఈ మూవీని దర్శకుడు ఎ.ఎస్ రవికుమార్ చౌదరి తెరకెక్కించనున్నాడు. సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా పతాకంపై నిర్మాత మల్కాపురం శివకుమార్ నిర్మిస్తున్నారు.

తారాగణం: రాజ్ తరుణ్
కథ-స్క్రీన్ ప్లే-దర్శకత్వం: ఎ.ఎస్ రవికుమార్ చౌదరి
బ్యానర్ : సురక్ష ఎంటర్టైన్మెంట్ మీడియా
నిర్మాత : మల్కాపురం శివకుమార్
ఛాయాగ్రహణం: జవహర్ రెడ్డి
సంగీతం: జె. బి
ఆర్ట్ : రవికుమార్ గుర్రం
ఎక్సిక్యూటివ్ నిర్మాత: బెక్కెం రవీందర్
పీఆర్వో : వంశీ శేఖర్

Related Posts

Latest News Updates