Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హనుమకొండ బీజేపీ సభకు అనుమతినిచ్చిన హైకోర్టు…

తెలంగాణ బీజేపీకి హైకోర్టులో మళ్లీ ఊరట లభించింది. అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ముగింపు సభకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. హన్మకొండ ఆర్ట్స్ కాలేజీ మైదానంలో బీజేపీ సభ జరుపుకోవచ్చని హైకోర్టు తేల్చి చెప్పింది. పోలీసులు అనుమతి ఇవ్వని కారణంగా ఆర్ట్స్ కాలేజీలో నిర్వహించే బీజేపీ సభకు అనుమతి ఇవ్వలేమని ప్రిన్సిపాల్ తేల్చి చెప్పారు. దీంతో బీజేపీ హైకోర్టులో లంచ్ మోషన్ పిటిషన్ దాఖలు చేసింది. తమకు అనుమతి ఇవ్వాలంటూ లంచ్ మోషన్ పిటిషన్ లో కోరింది. దీంతో హైకోర్టు ఈ పిటిషన్ ను స్వీకరించి, ఇరు పక్షాల వాదనలను విన్నది. చివరికి బీజేపీ సభకు అనుమతినిస్తూ హైకోర్టు తీర్పునిచ్చింది.

 

మరోవైపు హైకోర్టు ఇచ్చిన తీర్పును బీజేపీ అధ్యక్షుడు, ఎంపీ బండి సంజయ్ స్వాగతించారు. చట్టాన్ని, రాజ్యాంగాన్ని గౌరవిస్తామని చెప్పారు. కోర్టును తప్పుదారి పట్టించే విధంగా ప్రభుత్వం వ్యవహరించిందని బండి మండిపడ్డారు. సభ కోసం ఆర్ట్స్ కాలేజీ గ్రౌండ్ ను ముందే బుక్ చేసుకున్నా, పై నుంచి వచ్చిన ఒత్తిడి వల్ల ప్రిన్సిపల్ అనుమతి రద్దు చేస్తామని చెప్పారని అన్నారు. తమ సభకు ప్రజలు భారీగా తరలివస్తారని, కార్యకర్తలు కూడా వస్తారని, దీనిని సీఎం కేసీఆర్ చూడాలని చురకలంటించారు. మరో వైపు ఈ సభకు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ అధ్యక్షుడు బండి సంజయ్ హాజరుకానున్నారు.

Related Posts

Latest News Updates