Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

హైదరాబాద్‌ తగ్గిన గృహాల విక్రయాలు

దేశంలోని తొమ్మిది ప్రధాన నగరాల్లో గృహాల అమ్మకాల్లో వృద్ధి నమోదైంది. ఏప్రిల్‌ – జూన్‌ మధ్య కాలంలో అమ్మకాల్లో 6 శాతం గ్రోత్‌ కనిపించిందని ప్రాప్‌ఈక్విటీ సర్వే తెలిపింది. అయితే ఇదే సమయంలో కొత్త గృహాల సప్లయిలో మాత్రం 11 శాతం క్షీణత నమోదైందని సర్వే పేర్కొంది.
5,89,503 గృహాల ఇన్వెంటరీ
గుర్గావ్, నోయిడా, ముంబై, కోల్‌కతా, పుణే, హైదరాబాద్, బెంగళూరు, థానే, చెన్నై నగరాల్లో ఏప్రిల్‌ – జూన్‌ మధ్య కాలంలో 61,789 గృహాలు విక్రయమయ్యాయి. గతేడాది ఇదే కాలానికి అమ్మకాలు 58,292 యూనిట్లుగా ఉన్నాయి. ఇక, కొత్త గృహాలు ప్రారంభాలు ఈ ఏడాది ఏప్రిల్‌ – జూన్‌లో 51,108 యూనిట్లుగా కాగా.. గతేడాది ఇదే సమయంలో 57,425 గృహాలుగా ఉన్నాయి. విక్రయం కాకుండా ఉన్న గృహాలు (ఇన్వెంటరీ) 5,89,503 యూనిట్లుగా ఉన్నాయి.
విక్రయాలు నగరాల వారీగా చూస్తే..
హైదరాబాద్‌లో ఏప్రిల్‌ – జూన్‌లో 4,219 గృహాలు అమ్ముడుపోయాయి. గతేడాది ఇదే కాలంతో పోలిస్తే 11 శాతం తగ్గుదల. బెంగళూరులో 10,859 యూనిట్లు, చెన్నైలో 4,687, పుణేలో 16,025, ముంబైలో 6,125, గుర్గావ్‌లో 2,378 గృహాలు విక్రయమయ్యాయి. 2018 తర్వాత నుంచి డెవలపర్లు కొత్త గృహాల ప్రారంభాల్లో ఆచితూచి వ్యవహరిస్తున్నారని ప్రాప్‌ ఈక్విటీ ఫౌండర్‌ అండ్‌ ఎండీ సమీర్‌ జాసుజా తెలిపారు. ధరలను అందుబాటులో ఉంచేందుకు ఫ్లాట్ల విస్తీర్ణాలను తగ్గిస్తున్నారని పేర్కొన్నారు.

Related Posts

Latest News Updates