Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

రాక్‌ గార్డెన్‌లో అక్రమ నిర్మాణాలు

హైదరాబాద్‌లోని రాక్‌ గార్డెన్‌ పార్క్‌ మీద కబ్జాదారుల కన్ను పడింది. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నంబరు 86లో ఉన్న గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌ఎంసీ) రాక్‌ గార్డెన్‌ పార్క్‌ స్థలంలో ఇష్టారాజ్యంగా అక్రమ నిర్మాణాలు కొనసాగుతున్నాయి. పార్కు స్థలంలోకి గోడలు నిర్మించి దర్జాగా కబ్జాలు చేసినా టౌన్‌ప్లానింగ్‌ అధికారులు, జీహెచ్‌ఎంసీ బయోడైవర్సిటీ విభాగం అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేకుండా పోయాయి. ఫలితంగా చాలా మంది ప్లాటు దారులు పార్కు స్థలంలోకి గోడలు నిర్మించి కబ్జా చేసి ఆక్రమించేశారు. జీహెచ్‌ఎంసీ అధికారుల నిర్వాకంతోనే ఈ కబ్జాలు జోరుగా సాగుతున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ కబ్జాలను చూసి జీహెచ్‌ఎంసీ ఖైరతాబాద్‌ జోనల్‌ కమిషనర్‌ ముఫారఫ్‌ ఫారుఖి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే వీరందరికీ నోటీసులు జారీ చేయాలని ఆదేశించారు. ఒకవేళ స్పందించకపోతే అక్రమ నిర్మాణాలు ఎంతటివారైనా వదిలిపెట్టకుండా కూల్చివేయాలని నిర్ణయించారు. త్వరలోనే కబ్జాదారులకు నోటీసులు జారీచేయనున్నారు.

Related Posts

Latest News Updates