గృహాల డిమాండ్‌లో ఐటీ హబ్‌లైన హైదరాబాద్, బెంగళూరులు సమాంతరంగా పోటీ పడుతున్నాయి. 2018తో పోలిస్తే 2019లో ఈ రెండు నగరాల్లో గృహాలకు డిమాండ్ 10 శాతం పెరిగిందని మ్యాజిక్ బ్రిక్స్ సర్వే తెలిపింది. మిగిలిన నగరాల్లో చూస్తే.. ముంబైలో 9 శాతం, పుణే, ఢిల్లీలల్లో 8 శాతం, చెన్నైలో 5 శాతం, కోల్‌కతాలో 4 శాతం, అహ్మదాబాద్, నవీ ముంబై, గుర్గావ్లల్లో 3 శాతం, థానే, నోయిడాలో 2 శాతం, గ్రేటర్ నోయిడాలో 1 శాతం పెరిగాయి. సర్వేలోని పలు ఆసక్తికర అంశాలివే..
– 2019లో 6.4 కోట్ల మంది గృహాల కోసం వెతికారు. ఇది ఫ్రాన్స్ జనాభాతో సమానం. గతేడాదితో పోలిస్తే ఇది 39 శాతం వృద్ధి. 50 శాతం కొనుగోలుదారులు దేశంలోని ఆరు ప్రధాన నగరాల్లో గృహ కొనుగోళ్లకే మొగ్గు చూపారు. 33 శాతం ద్వితీయ శ్రేణి పట్టణవాసులు గృహ కొనుగోళ్ల కోసం చూశారు.
– ముంబై మెట్రోపాలిటన్ రీజియన్ (ఎంఎంఆర్)లో 50 శాతం మంది కస్టమర్లు సింగిల్ బెడ్ రూమ్ గృహాలను కొనేందుకు లేదా అద్దెకు ఉండేందుకు మొగ్గు చూపారు. గుర్గావ్లో 67 శాతం కస్టమర్లు 3 బీహెచ్‌కే లేదా అంతకు పెద్ద సైజు గృహాల కోసం వెతికారు. థానేలో 60 శాతం కస్టమర్లు 750 చ.అ.లు లేదా అంతకంటే తక్కువ సైజు విస్తీర్ణ గృహాల కొనుగోళ్లకే జై కొట్టారు. బ్యాచ్లర్స్ తొలి ఎంపిక పుణే, బెంగళూరు నగరాలే. వాస్తు ఆధారిత గృహాల్లోనూ ఈ నగరాల్లోనే ప్రాధాన్యం ఎక్కువగా ఉంది.
– దేశవ్యాప్తంగా 75 శాతం మంది కస్టమర్లు 2 లేదా 3 బీహెచ్‌కే గృహాల కొనుగోళ్లకే ఆసక్తి చూపించారు. వసతుల విషయంలో కస్టమర్ల ప్రధాన చాయిస్‌లు సెక్యూరిటీ, రిజర్డ్వ్ పార్కింగ్, పవర్ బ్యాకప్లే. గత రెడేళ్లుగా విశాఖపట్నం, కోయంబత్తూరు, ఆగ్రా, కోచి, లుథియానా నగరాల్లో 50 శాతం కస్టమర్లు గృహాల కొనుగోళ్లకు ఆసక్తి చూపించారు.