Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

మధ్యప్రదేశ్‌ సీఎం మేనల్లుడి ఆస్తుల జప్తు

మధ్యప్రదేశ్‌ ముఖ్యమంత్రి కమల్‌నాథ్‌ మేనల్లుడు రతుల్‌ పూరీ ఆస్తులు జప్తు అయ్యాయి. బినామీ ప్రాపర్టీ ట్రాన్సాక్షన్‌ యాక్ట్‌ కింద రూ.254 కోట్ల విలువ చేసే పలు ఆస్తులను ఆదాయ పన్ను (ఐటీ) శాఖ రూ.254 కోట్ల తాత్కాలికంగా ఆటాచ్‌ చేసింది. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ వీవీఐపీ చాపర్‌ స్కామ్‌ కుంభకోణంలో నిందితుల షెల్‌ కంపెనీ ద్వారా నిధులను పొందినట్లు ఆరోపణలు వచ్చాయి. ఆప్టిమా ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ప్రై.లి. షెల్‌ కంపెనీ నుంచి విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్‌డీఐ) రూపంలో రూ.254 కోట్ల పెట్టుబడులు వచ్చాయని ఐటీ విభాగం తెలిపింది. రతుల్‌ పూరీ హిందుస్తాన్‌ పవర్‌ ప్రాజెక్ట్స్‌ ప్రై.లి. చైర్మన్‌. ఆగస్టా వెస్ట్‌ల్యాండ్‌ లంచం కేసులో మరొక నిందితుడైన దుబాయ్‌కు చెందిన రాజీవ్‌ సక్సేనా నిర్వహిస్తున్న షెల్‌ కంపెనీ ద్వారా రతుల్‌ పూరీ సోలార్‌ ప్యానెల్స్‌ను దిగుమతి చేసుకోవటం, నిధులను స్వీకరించడం చేసేవాడని ఆరోపణలున్నాయి.

Related Posts

Latest News Updates