ఏపీ ప్రభుత్వం పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది. సీఎంవో స్పెషల్ సీఎస్ గా సీనియర్ ఐఏఎస్ పూనం మాలకొండయ్యను నియమించారు. వ్యవసాయ శాఖ స్పెషల్ సీఎస్ గా మధుసూదన్ రెడ్డి, పాఠశాల విద్య ముఖ్య కార్యదర్శిగా ప్రవీణ్ ప్రకాశ్ ను బదిలీ చేసింది. ఇక సెలవుపై వెళ్లిన బుడితి రాజశేఖర్ ను సెలవు నుంచి తిరిగొచ్చిన తర్వాత జీఏడీకి రిపోర్ట్ చేయాలని సూచించింది. ఆర్ అండ్ బీ సెక్రెటరీగా ప్రద్యుమ్న, వ్యవసాయ శాఖ కమిషనర్ గా రాహుల్ పాండే, హౌసింగ్ స్పెషల్ సెక్రెటరీగా మహ్మద్ దివాన్ ను సర్కార్ బదిలీ చేసింది.
