Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

సర్వే నం: 348/1లో అక్రమ నిర్మాణం కూల్చివేత.. స్వాధీనం!

ప్రభుత్వ స్థలాన్ని ప్లాట్లుగా చేసి విక్రయించి సొమ్ము చేసుకున్న భూకబ్జాదారుడిని కటకటాల్లోకి పంపిన కుత్బుల్లాపూర్‌ మండల తహశీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ సదరు నిర్మాణాన్ని కూల్చివేశారు. మండల పరిధిలోని జగద్గిరిగుట్ట సర్వే నెంబరు 348/1లో సుమారు రూ.3 కోట్ల విలువ చేసే 1200 గజాల స్థలం ప్లాట్లుగా చేసి వయ్యా వినోద్‌ అనే వ్యక్తి లక్షల్లో అమ్మకాలు చేపట్టాడు. ఈ విషయంపై ఫిర్యాదు అందుకున్న గౌతమ్‌కుమార్‌ ఆ దిశగా విచారణ చేపట్టి భూక్య ఉదయ్‌కుమార్, హజ్మీరా వీరన్న, హిమ నాయక్, ఎస్‌.నర్సింహ, అరవిందర్‌కుమార్‌ లకు వయ్యా వినోద్‌ ప్లాట్లను అమ్మిన్నట్లు గుర్తించారు. దీంతో ఈ నెల 21న మండల విఆర్‌ఓ లక్ష్మణ్‌ రాజు జగద్గిరిగుట్ట పోలీసులకు ఫిర్యాదు చేయగా కబ్జాదారుడిని అరెస్ట్‌ చేసి జైలుకు పంపిన విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం అక్రమంగా వెలిసిన ఐదు నిర్మాణాలను జేసిబి సహాయంతో కూల్చివేసి ప్రభుత్వ స్థలంగా బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో మోసపోయిన బాధితులు లబోదిబోమన్నారు.
కబ్జాదారుల జాతకాలు మా దగ్గర ఉన్నాయి..
అమాయకులను మోసం చేసి సొమ్ము చేసుకునే వారిని ఎట్టి పరిస్థితుల్లో వదలమని, కబ్జాదారులపై ఇక ముందు కఠినంగా వ్యవహరిస్తామని కుత్బుల్లాపూర్‌ మండల తహశీల్దార్‌ గౌతమ్‌కుమార్‌ చెప్పారు. ఇప్పటి వరకు మండఅల పరిధిలో 29 మందిపై కేసులు నమోదు చేశాం. వారి ప్రవర్తన మార్చుకోకుండా ప్రభుత్వ స్థలాలను ప్లాట్లు చేసి విక్రయిస్తే వారిపై ‘పిడి’ కిలి బిగిస్తాం. ఇప్పటికే ఎంతో మంది అమాయకులు మోసపోయి వీరి ఉచ్చులో పడ్డారు. కబ్జాదారుల జాతకాలన్నీ మా దగ్గర ఉన్నాయి. కొంత మంది తెలివిగా అమాయకులను ముందు పెట్టి కబ్జా నాటకాన్ని తెర లేపుతున్నారు. వారిని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించం. అందరిని గుర్తించి కేసులు నమోదు చేసి జైలుకు పంపించడం ఖాయం.

Related Posts

Latest News Updates