చింతల్ డివిజన్ పరిధిలోని చింతల్, భగత్‌సింగ్‌నగర్, చంద్రానగర్ తదితర కాలనీల్లో ఇబ్బడి ముబ్బడిగా అక్రమ నిర్మాణాలు జరుగుతున్నాయి. జీప్లస్–2కు అనుమతి తీసుకుని నాలుగైదు అంతస్తులు నిర్మిస్తున్నారు. చింతల్‌లోని సాయిబాబా ఆలయం వెనుక హెచ్ఎంటీ గోడకు ఆనుకుని రెండు భవన నిర్మాణదారులు అక్రమ నిర్మాణాలకు తెరలేపారు. వీటిపై ఫిర్యాదులు అందినా సంబంధిత టౌన్ ప్లానింగ్ అధికారులు సదరు భవన యజమానుల నుండి ఆమ్యామ్యాలు తీసుకుంటూ వారికే వత్తాసు పలుకుతున్నారు. దీంతో అక్రమ నిర్మాణదారులు రెచ్చిపోతూ ఇష్టానుసారంగా శ్లాబ్‌ల మీద శ్లాబ్‌లు వేస్తున్నారు. దీంతో ప్రభుత్వం ఆదాయానికి భారీగా గండి పడుతోంది. ఇప్పటికైనా టౌన్ ప్లానింగ్ అధికారులు అక్రమ నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.