మూసాపేటలోని మున్సిపల్ కార్యాలయంలో జీహెచ్ఎంసి, ఇతర అధికారులతో మంగళవారం కూకట్పల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ స్ధలాలు ఆక్రమించుకొని నిర్మాణాలు చేపడుతుంటే అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని టౌన్‌ప్లానింగ్ అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా నిర్మాణాలు చేపడుతున్న వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్ధలాలను కాపాడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.
వెటర్నరీ ఆసుపత్రికి స్థలం..
ప్రజలకు ఉపయోగపడే మౌళిక సదుపాయాలకు అవసరం అయ్యే ఖాళీ స్ధలాల్లో ఏíపీహెచ్బీ హౌసింగ్ బోర్డు వారు వెటర్నరీ ఆసుపత్రి, ఫైర్ స్టేషన్లకు స్ధలాలను కేటాయించాలని హౌసింగ్ బోర్డు అధికారులను కోరారు. చెరువుల అభివృద్ధి, సుందరీకరణ వంటి వాటిపై అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఎన్ని రివ్యూ సమావేశాలు జరిగిన అధికారుల్లో కదలిక లేదన్నారు. దీనిపై జెడ్సి ప్రత్యేక దష్టి సారించాల్సింగా కోరారు. వర్షాకాలంలో పార్కుల్లో మొక్కలు నాటి వాటిని సంరక్షించే పనులు వెంటనే ప్రారంభించాల్సిందిగా కోరారు. బాలానగర్ ఫ్లై ఓవర్ నిర్మాణం జరుగుతున్న ప్రాంతాల్లో రోడ్లు పూర్తిగా పాడైపోయాయని వెంటనే వాటిని యుద్ధ ప్రాతిపదికన నిర్మాణాలు చేపట్టాలని హెచ్ఎండీఏ అధికారులను కోరారు. డ్రైనేజీ, రోడ్లకు సంబంధించిన పనుల కొరకు నిధులు మంజూరు చేయవలసిందిగా ఎమ్మెల్యే జోనల్ కమీషనర్‌ను కోరారు. వాటర్ వర్కు కొత్తగా పైపు లైన్లు వేయవలసిన చోట వెంటనే పనులు ప్రారంభించాలని దానికి సంబంధించిన నిధులను మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు.