Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

ఈ భూములు కొనుగోలు చేసి మోసపోవద్దు

కోర్టు వివాదంలో ఉన్న స్థలాలను కొనుగోలు చేసి మోసపోవద్దని పేట్‌ బషీరాబాద్‌ గ్రామం సర్వే నెంబరు 25/1 అసైన్‌మెంట్‌ ల్యాండ్‌ నిర్వాసితులు పేర్కొన్నారు. పేట్‌ బషీరాబాద్‌లో జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ వివాదాస్పద భూమిలో చేపడుతున్న ప్లాటింగ్‌ పనులను మంగళవారం నిర్వాసితుల సంఘం సభ్యులు సందర్శించారు. ఈ సందర్భంగా సభ్యులు రాంబాగ్‌ ప్రకాశ్‌గౌడ్‌ మాట్లాడుతూ 1955లో అప్పటి ప్రభుత్వం 45 మందికి ఒక్కొక్కరికి 3 ఎకరాల 2 గుంటల చొప్పున వ్యవసాయం చేసుకునేందుకు భూమి ఇచ్చిందని తెలిపారు. 1965లో బి.రామలింగరాజు కో ఆపరేటివ్‌ ఆగ్రో ఇండస్ట్రీస్‌ను స్థాపించి ఇక్కడి వారికి ఉద్యోగాలు ఇప్పిస్తానని చెప్పి చదువురాని మా కుటుంబ సభ్యుల వద్ద భూమి తీసుకుని ప్రస్తుతం ప్లాట్లుగా చేసి విక్రయించారని తెలిపారు. కోర్టు వివాదంలో ఉన్నప్పటికీ ఇలా ఈ భూమి చాలామంది చేతులు మారిందని, ఇప్పుడు లక్షలు వెచ్చించి ప్లాట్లు కొనుగోలు చేస్తున్నారని ఆరోపించారు. ఇంత జరుగుతున్నా అధికారులు మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. న్యాయం జరగకుంటే పెద్ద ఎత్తున ఆందోళన చేపడతామని హెచ్చరించారు.

Related Posts

Latest News Updates