రియల్ ఎస్టేట్ విభాగంలో కో–వర్కింగ్ స్పేస్ హవా నడుస్తోంది. 2019 జనవరి నుంచి జూన్ మధ్య కాలంలో (తొలి అర్ధ సంవత్సరం) దేశంలోని ఎనిమిది ప్రధాన నగరాల్లో 40 లక్షల చదరపు అడుగుల కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. 2018 తొలి అర్ధ సంవత్సరంతో పోలిస్తే ఇది 42 శాతం వృద్ధి. కార్పొరేట్ కంపెనీలు, స్టార్టప్స్ ఈ స్పేస్‌ను అద్దెకు తీసుకున్నాయని ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెన్సీ నైట్‌ఫ్రాంక్ తెలిపింది.
ఆఫీస్ స్పేస్ 2.74 కోట్ల చ.అ.
ఢిల్లీ–ఎన్సీఆర్, ముంబై, చెన్నై, కోల్‌కతా, బెంగళూరు, హైదరాబాద్, పుణె, అహ్మదాబాద్ నగరాల్లో 2019 తొలి ఆరు నెలల కాలంలో 2.74 కోట్ల చదరపు అడుగుల ఆఫీస్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. ఇందులో ఐటీ, ఐటీఎస్ రంగాల వాటా 35 శాతం వరకుటుంది. గతేడాదితో పోలిస్తే మొత్తం ఆఫీస్ స్పేస్ లావాదేవీల్లో 26 శాతం వృద్ధి. గతేడాది జనవరి – మార్చి మధ్య కాలంలో 28 లక్షల చదరపు అడుగుల కో–వర్కింగ్ స్పేస్ లీజింగ్ లావాదేవీలు జరిగాయి. కో–వర్కింగ్ స్పేస్ కంపెనీల్లో చాలా వరకు 70 శాతానికి పైగా సీట్లు ఆక్యుపై ఉన్నాయి.