రూ.100 కోట్లతో అస్సాంలోని గౌహతిలో సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రిని నిర్మిస్తున్నామని వచ్చే 2021 ఏప్రిల్‌లో ఇది అందుబాటులోకి వస్తుందని ఇన్క్రెడిబుల్ ఇండియ ప్రాజెక్టు ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ సీవోవో ప్రవీణ్‌కుమార్, డైరెక్టర్ విజయ్‌కుమార్‌లు తెలిపారు. సికింద్రాబాద్ పార్క్‌లేన్‌లో ఈ గ్రూపు ఏర్పాటు చేసిన ఇన్క్రెడిబుల్ వన్ హోటల్‌ను వారు ప్రారంభించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఒక ఎకరం స్థలంలో నిర్మాణం జరుగుతుందని నగరానికి చెందిన పద్మశ్రీ గ్రహీత అయిన ఓ ప్రముఖ వైద్యులు ఈ ఆస్పత్రికి చైర్మన్‌గా వ్యవహరిస్తారని తెలిపారు. గత ఏడాది ఆతిధ్య రంగంలోకి ప్రవేశించి లక్డీకపూల్లో హ్యాంప్‌షైర్ ప్లాజా, కొచ్చిలో రాడిసన్ బ్లూ పేరుతో ప్రారంభించామని ఇప్పుడు రూ.25 కోట్లతో పార్క్‌లేన్‌లో ఇన్క్రెడిబుల్ వన్ను ప్రారంభించినట్లు వెల్లడించారు. ఈ ఏడాది మరో హోటల్ ప్రారంభించే అవకాశం ఉందని అలాగే 2020 నుంచి ప్రతి ఏడాది ఒక హోటల్ ఒప్పున విస్తరించాలనే ఆలోచన ఉందని వివరించారు. మ్యాన్‌ఫాక్చరింగ్ రంగంలోకి ప్రవేశించి రూ.60కోట్లతో పార్లీ సంస్థతో కలిసి యాదాద్రి జిల్లా దండు మల్కాపూర్‌లో 3 ఎకరాల స్థలంలో బిస్కెట్, కేక్ తయారీ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో 2వేల టన్నుల బిస్కెట్, 500 టన్నుల కేక్‌లను ఉత్ఫత్తి చేయనున్నట్లు తెలిపారు. 250 నుంచి 300 మంది వరకు అన్‌స్కిల్డ్ ఉద్యోగులకు ఉపాధి అవకాశాలు దొరుకుతాయని చెప్పారు. ఒక ప్రముఖ జ్యూవెరీ సంస్థతో కలిసి ఈ రంగంలోకి వస్తున్నామని అన్నారు. సామంత ఎడ్యుకేషనల్ సొసైటీ పేరుతో సొసైటీ ఏర్పాటు చేశామని 2021 సంవత్సరంలో విద్యారంగంలోకి విస్తరిస్తామని చెప్పారు. 2008 సంవత్సరంలో 25 ఎకరాలతో రియల్ ఎస్టేట్ రంగంలోకి వచ్చి ఇప్పుడు 2500 ఎకరాల ల్యాండ్ బ్యాంకుతో 2వేల మంది ఉద్యోగులు, 6వేల మంది మార్కెటింగ్ స్టాఫ్‌తో విస్తరించామని చెప్పారు. కేవలం అత్యధిక మందికి ఉపాధి అవకాశాలు కల్పించడమే లక్ష్యంగా ఆయా రంగాల్లోకి వ్యాపారాన్ని విస్తరిస్తున్నామని తెలిపారు.