Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మాట నిలబెట్టుకొన్న అధ్యక్షుడు జోబైడెన్.. 130 మంది భారత సంతతి వ్యక్తులకు కీలక పదవులు

అమెరికా అధ్యక్షుడు జో బైడెన్.. ఎన్నికల సందర్భంగా అక్కడి భారతీయులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. అమెరికా జనాభాలో దాదాపు 1శాతం పాపులేషన్ ఉన్న ఇండియన్స్‌కు తన ప్రభుత్వంలో పెద్ద పీట వేశారు.పాలనా యంత్రాంగంలో ఏకంగా 130మందికిపైగా భారత సంతతి వ్యక్తులకు కీలక బాధ్యతలు అప్పగించారు. దాదాపు అన్ని ప్రభుత్వ శాఖల్లో వీరికి చోటు కల్పించారు. అమెరికా జనాభాలో దాదాపు ఒక్క శాతం ఉన్న భారత సంతతి వ్యక్తులకు ఇంత ప్రాధాన్యం ఇవ్వడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.

 

2020 అధ్యక్ష ఎన్నికల ప్రచార సమయంలోనే భారత సంతతి వ్యక్తులకు సముచిత స్థానం కల్పిస్తామని హమీ ఇచ్చారు బైడెన్. ఇచ్చిన మాట ప్రకారం ఆ హామీని నిలబెట్టుకున్నారు. అంతేకాదు అమెరికా చరిత్రలోనే తొలిసారి భారత సంతతికి చెందిన మహిళ కమలా హ్యారిస్‌కు ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు. ఈ క్రమంలోనే బైడెన్ తన స్పీచ్ రైటర్‌గా వినయ్ రెడ్డి, కొవిడ్-19 ప్రధాన సలహాదారుగా డాక్టర్ ఆశిష్ ఝా, వాతావరణ విధానంపై సలహాదారుగా సోనియా అగర్వాల్, క్రిమినల్ జస్టిస్ విభాగానికి సంబంధించి సహాయకుడిగా చిరాగ్ బైన్స్, ఆఫీస్ ఆఫ్ పర్సనల్ మేనేజ్మెంట్ హెడ్‌గా కిరణ్ అహూజా, సీనియర్ సలహాదారుగా నీరా టాండెన్‌.. ఇలా పలువురు ఇండియన్ అమెరికన్లను బైడెన్ కీలక పదవుల్లో నియమించారు.

Related Posts

Latest News Updates