దేశీయ రియల్ ఎస్టేట్ మార్కెట్ 2030 నాటికి ట్రిలియన్ డాలర్లకు చేరనుంది. ఈ ఏడాది తొలి ఆరు నెలల కాలంలో (హెచ్1)లో దేశీయ రియల్టీ రంగంలోకి రూ.27,767 కోట్ల ప్రైవేట్ ఈక్విటీ (పీఈ) పెట్టుబడులు వచ్చాయని, గతేడాది ఇదే కాలంతో పోలిస్తే ఇది 26 శాతం వృద్ధి అని రియల్ ఎస్టేట్ బ్రోకరేజీ సంస్థ సిరిల్ తెలిపింది. సర్వే పేర్కొంది.
ఏ విభాగంలో ఎంతంటే?
2019 హెచ్1లో 1.1 కోట్ల చ.అ. కమర్షియల్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. 5 కోట్ల చ.అ. వాణిజ్య స్థలం నిర్మాణంలో ఉంది. కో–వర్కింగ్ స్పేస్ లావాదేవీల వాటా 25 శాతం ఉంది. రిటైల్ విభాగంలో 90 లక్షల చ.అ.లు, వేర్ హౌస్ విభాగంలో 13 కోట్ల చ.అ. లావాదేవీలు జరిగాయి. 2025 నాటికి 20 కోట్ల చ.అ. గ్రేడ్ ఏ వేర్ హౌస్ స్పేస్ అందుబాటులోకి వస్తుంది.
రియల్టీలోకి ఎఫ్‌డీఐ..
డిపార్ట్మెంట్ ఆఫ్ ఇండస్ట్రియల్ పాలసీ అండ్ ప్రమోషన్ (డీఐపీపీ) గణాంకాల ప్రకారం.. ఏప్రిల్ 2000 నుంచి మార్చి 2019 మధ్య కాలంలో మౌలిక, నిర్మాణ రంగంలోకి 25.05 బిలియన్ డాలర్ల విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చాయి. రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ (రీట్స్)లకు సెబీ ఆమోదం తెలపడంతో ఎంబసీ ఆఫీస్ పార్క్ రీట్స్ ద్వారా నిధులను సమీకరించింది. ఇదే తరహా మరిన్ని కంపెనీలు రీట్స్‌లోకి రానున్నాయి.
వాణిజ్యంలో హైదరాబాద్ హవా..
దేశంలో కమర్షియల్ రియల్ ఎస్టేట్ విభాగంలో హైదరాబాద్ హవా నడుస్తోంది. 2019 తొలి ఆరు నెలల కాలంలో నగరంలో 30 లక్షల చ.అ. గ్రేడ్–ఏ కమర్షియల్ స్పేస్ లావాదేవీలు జరిగాయి. మరొక 70 లక్షల చ.అ. వాణిజ్య స్థలం, 10 లక్షల రిటైల్ స్పేస్ ఈ ఏడాది ముగింపు నాటికి అందుబాటులోకి రానుంది. హైటెక్ సిటీ, మాదాపూర్, గచ్చిబౌలి, కొండాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ ప్రాంతాలు కమర్షియల్ స్పేస్‌కు హాట్‌కేక్‌లా మారాయి. డిమాండ్ దృష్ట్యా కమర్షియల్ స్పేస్ అద్దెలు 10–12 శాతం వృద్ధి చెందాయి.