గృహ సముదాయాల విభాగంలో దేశంలోనే అతిపెద్ద సోలార్ పవర్ ప్రాజెక్ట్ గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ లాంఛనంగా ప్రారంభమైంది. కాళీమందిర్ సమీపంలో ఎనిమిదిన్నర ఎకరాల్లో గిగిరిధారి హోమ్స్ నిర్మించిన ఈ ప్రాజెక్ట్‌లో గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ ఓనర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ 715 కిలోవాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్ట్‌ను ఏర్పాటు చేసింది. ఈ ప్లాంట్ నుంచి నెలకు 85 వేల కిలోవాట్లు, ఏటా సుమారు 10.2 లక్షల యూనిట్లకు పైగా విద్యుత్‌ను ఉత్పత్తి అవుతుందని అసోసియేషన్ ప్రెసిడెంట్ యాదగిరి రెడ్డి కటిక తెలిపారు.
ఘనంగా ప్రారంభోత్సవం..
గిరిధారి ఎగ్జిక్యూటివ్ పార్క్ సోలార్ ప్లాంట్‌ను ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర మంత్రి సీహెచ్ మల్లారెడ్డి హాజరయ్యారు. రాజేంద్రనగర్ ఎమ్మెల్యే టీ ప్రకాశ్ గౌడ్, టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ జి. రఘుమారెడ్డి, టీఎస్రెడ్కో వీసీ అండ్ ఎండీ ఎన్ జానయ్య తదితరులు పాల్గొన్నారు.
రూ.1.16 కోట్ల సబ్సిడీ..
ఈ ప్లాంట్ ఏర్పాటుకు రూ.3.87 కోట్లు ఖర్చు కాగా.. ఇందులో రూ.1.16 కోట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి సబ్సిడీ వచ్చిందని, మిగిలిన సొమ్మును అసోసియేషన్ కార్పస్ ఫండ్ నుంచి కేటాయించారు. ఈ ప్రాజెక్ట్‌ను సికింద్రాబాద్‌కు చెందిన అవగ్ని రిన్యూవబుల్ ఎనర్జీ సిస్టమ్ ఇండియా డిజైన్ నిర్వహణ చేసింది. బొగిస్ సోలార్ మెస్సర్స్ టెక్నికల్ కన్సల్టెన్సీగా ఉంది.
నెలకు కరెంట్ బిల్లు రూ.400–500
గతంలో నెలకు రూ.12 లక్షల కరెంట్ బిల్లు వచ్చేది. కానీ, సోలార్ పవర్ ఏర్పాటు తర్వాత రూ.6–7 లక్షల మధ్య వస్తుంది. నెలకు సుమారు రూ.6 లక్షల వరకు ఆదా అవుతుంది. కుటుంబం వారీగా చూసుకుటే గతంలో ఒక్క ఫ్యామిలీకి రూ.1,200 కరెంట్ వస్తుండే.. కానీ, ఇప్పుడు రూ.400–500 మధ్య వస్తుంది. డబ్బు ఆదా చేయడమే కాకుండా, పర్యావరణాన్ని దోహదం చేసినట్టవుతుందని అసోసియేషన్ తెలిపింది.