Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

ఫామ్‌ ల్యాండ్స్‌లో పెట్టుబడి బెటరేనా?

ఫామ్‌ ల్యాండ్‌.. ఈ మధ్య కాలంలో రియల్టీ పెట్టుబడులకు హాట్‌కేక్‌లా మారింది. ప్లాట్, అపార్ట్‌మెంట్, ఇండివిడ్యువల్‌ హౌస్, విల్లా.. ఇలాంటి రెసిడెన్షియల్‌ విభాగాల్లో పెట్టుబడుల నుంచి కొనుగోలుదారులు వ్యవసాయ భూముల రియల్టీలోకి మళ్లుతున్నారు. పండ్లు, ఎర్ర చందనం, మలబార్‌ వేప వంటి రకరకాల మొక్కల పెంపకంతో ఫామ్‌ ల్యాండ్స్‌ని గ్రీనరీగా అభివృద్ధి చేస్తుండటంతో వీటికి డిమాండ్‌ పెరిగింది.
ఇరుకిరు రోడ్లు, విస్తీర్ణం తక్కువుండే ఫ్లాట్లు, అధిక ధరలు, కాలుష్యం, ట్రాఫిక్‌ రణగొణ ధ్వనుల నుంచి గృహ కొనుగోలుదారులు విముక్తి కోరుకుంటున్నారు. అందుకే శివార్లు, అభివృద్ధికి ఆస్కారముండే ప్రాంతాలు, తక్కువ పెట్టుబడితో రెట్టింపు ఆదాయం చేకూర పెట్టుబడి మార్గాలను అన్వేషిస్తున్నారు. వీటికి పరిష్కారం చూపిస్తున్నాయి ఫామ్‌ ల్యాండ్స్‌. పోరంబోకు భూములను పచ్చని మొక్కలతో గ్రీనరీతో నింపేసి.. ఆహ్లాద, ఆరోగకరమైన పరిసరాలను అభివృద్ధి చేస్తున్నారు డెవలపర్లు. అందుకే ఫామ్‌ ల్యాండ్స్‌లో పెట్టుబడులు పెట్టేందుకు కస్టమర్లు ఆసక్తి చూపిస్తున్నారు. ప్రశాంతమైన వాతావరణంలో, ఆహ్లాదకరమైన ప్రాంతంలో పచ్చని చెట్ల మధ్య జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నారని చెప్పారు. ఎన్‌ఆర్‌ఐలు, వైద్యులు, ఐటీ ఉద్యోగులు, వ్యాపారస్తులు ఎక్కువగా ఫామ్‌ ల్యాండ్స్‌ను కొంటున్నారు. 500, 1,000 గజాల్లో వీటిని కొనుగోలు చేసి, గార్డెన్, ప్లాంటేషన్‌ వంటివి చేయడానికి ఇష్టపడుతున్నారు.
ఫామ్‌ ల్యాండ్స్‌ ఎక్కడంటే?
కాంక్రీట్‌ జంగిల్‌లో కాకుండా శివారు ప్రాంతాల్లో ఇండిపెండెంట్‌ హౌస్, విల్లాలు కట్టుకోవాలని కస్టమర్లు కోరుకుంటున్నారు. రోడ్డు, రైల్‌ కనెక్టివిటీ ఉన్న శివార్లలో ఆసక్తి చూపిస్తున్నారు. పటాన్‌చెరు, కంది, మొయినాబాద్, శంషాబాద్, షాద్‌నగర్, దుండిగల్‌ వంటి ప్రాంతాల్లో ఫామ్‌ ల్యాండ్‌ ప్రాజెక్ట్‌లు ఎక్కువగా వస్తున్నాయి. హైటెక్‌సిటీ, గచ్చిబౌలి, కూకట్‌పల్లి, మియాపూర్, బీహెచ్‌ఈఎల్‌ వంటి ప్రాంతాలతో అనుసంధానమై ఉన్న ప్రాంతాల్లో ప్రాజెక్ట్‌లకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఫామ్‌ ల్యాండ్స్‌ ప్రాజెక్ట్‌ చుట్టూ కట్టుదిట్టమైన ప్రహారీ గోడ, రోడ్లు, డ్రిప్, ఎలక్ట్రిసిటీ వంటి అన్ని రకాల మౌలిక వసతులతో పాటూ వీకెండ్స్‌లో కుటుంబంతో కలిసి ఆనందంగా గడిపేందుకు స్విమ్మింగ్‌ పూల్, క్లబ్‌ హౌస్, రిసార్ట్‌ వంటి అన్ని రకాల వసతులను ఏర్పాటు చేస్తున్నారు.
ఈఎంఐ స్కీమ్‌లో మోసాలెక్కువ..
సామన్య ప్రజలను కూడా ఫామ్‌ ల్యాండ్స్‌ వైపు ఆకర్షించేందుకు కొంత మంది డెవలపర్లు నెలవారి వాయిదా (ఈఎంఐ) స్కీమ్‌లను తీసుకొస్తున్నారు. అయితే వీటి వల్ల కొనుగోలుదారులకు లాభం కంటే నష్టాలెక్కువ ఉంటాయనిని ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా ఎండీ శ్రీనివాస్‌ రెడ్డి తెలిపారు. సాధారణంగా ఈ స్కీమ్‌ల్లో ఐదేళ్ల పాటు వాయిదా పద్ధతులుంటాయి. రూ.6 వేలతో ఈఎంఐ మొదలైందనుకుందాం. గడువు ముగిసే నాటికి ఆయా ప్రాంతంలో ల్యాండ్‌ ధరలు పెరుగుతాయి. కాబట్టి ప్రారంభంలో రూ.6 వేలున్న ప్లాట్‌ ధర రూ.12–15 వేలకు చేరుతుంది. ఆ సమయంలో డెవలపర్‌ మనసు మారవచ్చు. రిజిస్ట్రేషన్‌ చేయకుండా కిరికిరి పెట్టే ప్రమాదం ఉంది. రేటు ఎక్కువుంది కాబట్టి మరిన్ని డబ్బులు ఇస్తేనే అగ్రిమెంట్‌ చేసుకుందామనే అవకాశముంటుందని ఆయన వివరించారు.
మొక్కల పెంపకం కంపెనీదే..
ఇప్పటివరకు ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా నుంచి కొంపల్లి, మహేశ్వరం, మోకిల, బానూర్, నందిగామ, పాటిఘన్‌పూర్‌ వంటి ప్రాంతాల్లో 500 ఎకరాలను అభివృద్ధి చేశాం. ప్రస్తుతం బేగంపేట గ్రామంలో గచ్చిబౌలి ప్యారడైజ్‌ కౌంటీ ఎక్స్‌టెన్షన్‌ ఫామ్‌ ల్యాండ్‌ ప్రాజెక్ట్‌ను చేస్తున్నాం. ఇది మొత్తం 40 ఎకరాలు. 320 ప్లాట్లుంటాయి. ఒక్కో ప్లాట్‌ 300 గజాల్లో ఉంటుంది. ఇందులో పది ఎర్ర చందనం, పది మలబార్‌ వేప, 10 పండ్ల మొక్కలను పెంచుతాం. ధర గజానికి రూ.6 వేలు. వచ్చే రెండు నెలల్లో శంకర్‌పల్లిలో 23 ఎకరాలు, బానూర్‌లో 12 ఎకరాల్లో రెండు ప్రాజెక్ట్‌లను ప్రారంభించనున్నాం. ఫామ్‌ల్యాండ్స్‌లో పెంచే మొక్కల పెంపకం బాధ్యత కంపెనీదే ఉంటుంది. ఏడేళ్ల పాటు వాటిని మెయింటనెన్స్‌ చేస్తారు. క్రాపింగ్‌ ద్వారా వచ్చే ఆదాయంలో కస్టమర్, కంపెనీకు మధ్య 60:40 శాతం వాటాలుంటాయి. ఏడేళ్ల తర్వాత ఒక్క ప్లాట్‌లోని క్రాపింగ్‌ ద్వారా సుమారు రూ.7 లక్షల ఆదాయం ఉంటుంది.
సబ్సిడీ కల్పిస్తే.. మరింత వృద్ధి
ప్రభుత్వం హరితహారం కార్యక్రమంలో ఎలాగైతే డ్రిప్, స్ప్రింకర్లకు సబ్సిడీ ఇస్తున్నారో అలాగే ఫామ్‌ ల్యాండ్స్‌ ప్రాజెక్ట్స్‌లో చేపట్టే డ్రిప్‌ ఇరిగేషన్, ప్లాంటేషన్‌లకు కూడా సబ్సిడీ కల్పించాలని ఎస్‌ఆర్‌ఆర్‌ ఫార్చ్యూన్‌ ఇన్‌ఫ్రా ఎండీ పి. శ్రీనివాస్‌ రెడ్డి సూచించారు. దీంతో మరింత మంది డెవలపర్లు ఫామ్‌ ల్యాండ్‌ ప్రాజెక్ట్‌లు చేయడానికి ముందుకొస్తారు. గ్రీనరీ శాతం కూడా రెట్టింపు వేగంతో అభివృద్ధి చెందుతుందన్నారు.

Related Posts

Latest News Updates