రాత్రి వేళ గచ్చిబౌలిలోని ప్రముఖ విద్యాసంస్థలు, శాంతిసరోవర్, ఐటీ కారిడార్ ప్రాంతం విద్యుత్ వెలుగులో జిగేల్ మంటున్నాయి. ముఖ్యంగా ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ (ఐఎస్బీ), ఉర్దూ విశ్వవిద్యాలయం ప్రధాన ద్వారం, ఇంజినీరింగ్ స్టాఫ్ కాలేజ్ ఆఫ్ ఇండియా(ఈఎస్సీఐ), బ్రహ్మకుమారీస్ సంస్థకు చెందిన శాంతిసరోవర్‌లోని గ్లోబల్ పీస్ ఆడిటోరియం విద్యుత్ వెలుగుల్లో జిగేల్ మంటూ కొత్త అందాలను తెస్తున్నాయి. కాగా నానక్‌రాంగూడలోని ఫైనాన్షియల్ డిస్ట్రిక్స్ ప్రాంతంలోని విప్రో సర్కిల్ నుంచి ఐసీఐసీఐ బ్యాంక్ వరకున్న రోడ్డు రాత్రి వేళల్లో విద్యుత్ బల్బుల కాంతిలో వెలిగిపోతుంటుంది.