Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

రా చెరువు సుందరీణకరణలో ఐటీ ఉద్యోగులు!

బోడుప్పల్‌లోని ‘రా’ చెరువు చుట్టూ కాలనీలు విస్తరించడంతో చెరువు స్వరూపమే కోల్పోయి దుర్గంధ భరితంగా మారింది. చెరువు శుద్ధికి ప్రభుత్వం అరకొర చర్యలు తీసుకున్నప్పటికి ఫలితం లేకుండా పోయింది. దీంతో చెరువును శుద్ధి చేసేందుకు తమ వంతు బాగస్వాములైన సాప్ట్‌వేర్‌తో కూడిన మిత్ర బందం, స్వచ్చంధ సంస్థలు, మరి కొంత మంది స్థానికులు ఏకమై ముందుకు వచ్చారు. ప్రతి రోజు తమ రోజు వారి విధుల్లో నిమగ్నమైనప్పటికి సెలవు రోజులైన ఆదివారంలో శ్రమదానం చేయాలని నిశ్చయించుకున్నారు. అందుకు తగిన పరికరాలను సమకూర్చు కుని నాలుగు గంటల పాటు శ్రమదానం చేస్తున్నారు. చెరువులోని చెత్త చెదారాన్ని, చిల్ల చెట్లను, ప్లాస్టిక్‌ కవర్లను, గుర్రపు డెక్కను దశల వారీగా తొలగిస్తూ ఆదర్శంగా నిలుస్తున్నారు.

దుర్గంధం వెదజల్లుతున్న రా చెరువు…
బోడుప్పల్‌ నగర్‌ పాలక సంస్థలో రా చెరువు ఉంది. చెరువు మొత్తం 47.42 ఎకరాల్లో విస్తరించి ఉంది. సర్వేనంబరు 126లో రా చెరువు 17.06 ఎకరాలో విస్తీర్ణంలో ఉండగా, సర్వేనంబరు 216లో ఎఫ్‌టిఎల్‌ 27.06 ఎకరాల్లో ఉంది. బపర్‌ జోన్‌ కింద 3.30 ఎకరాల స్థలం ఉంది. చెరువు అనుకుని మల్లయ్యనగర్, దేవేందర్‌నగర్, అంబేద్కర్‌ నగర్, గౌతమినగర్, నాచారం, మల్లాపూర్‌ కాలనీలతోపాటు పారిశ్రామిక వాడ ఆనుకుని ఉంది. సదరు పారిశ్రామిక వాడలోని పలు సంస్థలు తమ కంపెనీ నుంచి కెమికల్‌ వాటర్‌ను పైపుల ద్వార తీసుకొచ్చి రా చెరువులో కలుపు తున్నాయి. అంతేకాకుండా కొన్ని కాలనీల నుంచి అండర్‌ గ్రౌండ్‌ డ్రైనేజీ వచ్చి చెరువులోకి చేరుతుంది. చెరువులోకి వచ్చిన కెమికల్‌వాటర్‌. మురుగునీరు అక్కడే నిలిచిపోయి దుర్గంధం వస్తుంది. అంతేకాకుండా చెరువును ఆనుకుని నివాసం ఉంటున్న కాలనీవాసులు చెత్త చెదారాన్ని చెరువులోనే వేస్తున్నారు. దీంతో చెరువు అంతా అపరిశుభ్రంగా ఏర్పడి విపరీతమైన దుర్గంధం వస్తుంది. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం మిషన్‌ కాకతీయ ఫేస్‌ 2 పథకం కింద చెరువును శుద్ధి చేసేందుకు ముందుకు వచ్చి రూ.75 లక్షలు నిధులు మంజూరు చేశారు. కెమికల్‌ వాటర్, డ్రైనేజీ నీరు చెరువులోకి రాకుండా ప్రత్యేకంగా పైపులైన్‌ వేసి మూసీలో కలపాలని ప్రణాళికలు రూపొందించారు. చెరువులో ఒండ్రుమట్టి ఉండడంతో పనులు ముందుకు సాగలేదు. దీంతో కాంట్రాక్టర్‌ సదరు కాంట్రాక్ట్‌ నుంచి విరవించుకున్నారు. దీంతో పనులు ఆగిపోయాయి.


సాప్ట్‌వేర్‌ ఉద్యోగులు… స్వచ్చంధ సంస్థలు శ్రమదానం
హైటెక్‌ సిటీలోని నెట్‌ క్రాకర్‌ సాప్ట్‌వేర్‌ కంపెనీలో పని చేసే 30 మంది ఉద్యోగులు హెల్పింగ్‌ హ్యాండ్స్‌ హ్యూమనిటీ ఎ వాలంటీర్‌ ఆర్గనైజేషన్‌ సంస్థను స్థాపించారు. ప్రశాంత్, దిలీప్, రమేష్‌లు యాక్టివ్‌గా పని చేస్తున్నారు. గత ఆరు వారాలుగా బోడుప్పల్‌లో ఉన్న ఒకే ప్రపంచ ప్రజా ఫౌండేషన్‌ స్వచ్చంధ సంస్థతో కలిసి రా చెరువులో శ్రమదానం చేస్తున్నారు. ప్రతి ఆదివారం ఉదయం 6.30 గంటల నుంచి 9.30 గంటల వరకు చేస్తున్నారు. అంతేకాకుండా స్థానికంగా ఉన్న కాలనీవాసులను బాగస్వాములుగా చేసుకుని అందరూ కలిసి కట్టుగా పని చేస్తున్నారు. ఇప్పటి వరకు చెరువు అలుగు వద్ద ఉన్న చెత్త చెదారాన్ని తొలగించారు. కట్టపై ఉన్న చిల్ల చెట్లను, గుర్రపు డెక్కను, పాలిధిన్‌ కవర్ల తొలగిస్తున్నారు. ఇందులో బోడుప్పల్‌ నగరపాలక సంస్థ అధికారులు, ఇరిగేషన్‌ అధికారులు, స్థానిక కాలనీవాసులను భాగస్వాములను చేసి చెరువును శుద్ధి చేసేందుకు నడుం బిగించారు.

Related Posts

Latest News Updates