Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

అల్లరి నరేష్ ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 11న విడుదల

వెర్సటైల్ హీరో అల్లరి నరేష్ కథానాయకుడిగా  ఏఆర్ మోహన్ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ లో ఉంది. జీ స్టూడియోస్‌తో కలిసి హాస్య మూవీస్‌పై రాజేష్ దండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. టీజర్‌కి అద్భుతమైన రెస్పాన్స్ రావడంతో ఈ చిత్రంపై అంచనాలు మరింతగా పెరిగాయి.  సినిమా కథాంశాన్ని ఆవిష్కరించిన టీజర్ వీడియోలో అల్లరి నరేష్‌ ఎన్నో సవాళ్లను ఎదుర్కొకోని గిరిజన ప్రాంతమైన మారేడుముల్లిలో ఎన్నికల విధులకు వచ్చిన  ప్రభుత్వ అధికారిగా ఇంటెన్స్ పాత్రలో కనిపించారు. ఈరోజు సినిమా విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం’ నవంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. అనౌన్స్‌మెంట్ పోస్టర్‌లో నరేష్, అతని సహచరులు, పోలీసు అధికారులతో కలిసి గిరిజన ప్రాంతంలో నడుస్తున్నట్లు కనిపిస్తోంది. ఆనంది కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో కనిపించనున్నారు.  బాలాజీ గుత్తా సహనిర్మాత వ్యవహరిస్తున్న ఈ చిత్రానికి శ్రీచరణ్ పాకాల సంగీతం అందిస్తున్నారు. రాంరెడ్డి సినిమాటోగ్రఫర్ గా పని చేస్తున్నారు. అబ్బూరి రవి మాటలు అందించగా,  బ్రహ్మ కడలి ఆర్ట్ డైరెక్టర్ గా చోటా కె ప్రసాద్ ఎడిటర్ గా పని చేస్తున్నారు. తారాగణం: అల్లరి నరేష్, ఆనంది, వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రచన, దర్శకత్వం: ఎఆర్ మోహన్ నిర్మాత: రాజేష్ దండా నిర్మాణం: జీ స్టూడియోస్,  హాస్య మూవీస్ సహ నిర్మాత: బాలాజీ గుత్తా సంగీతం: శ్రీచరణ్ పాకాల డైలాగ్స్: అబ్బూరి రవి డీవోపీ: రాంరెడ్డి ఆర్ట్ డైరెక్టర్: బ్రహ్మ కడలి ఎడిటర్: ఛోటా కె ప్రసాద్ స్టంట్స్: పృథ్వీ కొరియోగ్రఫీ: శేఖర్ మాస్టర్, బిన్నీ డిఐ – అన్నపూర్ణ స్టూడియోస్ పీఆర్వో: వంశీ-శేఖర్

Related Posts

Latest News Updates