14 వ ఉపరాష్ట్రపతిగా జగదీప్ ధన్కర్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్ట్రపతి భవన్ లో ఆయనతో ప్రమాణ స్వీకారం చేయించారు. ఈ కార్యక్రమానికి లోకసభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని మోదీ, వెంకయ్య నాయుడు, మాజీ రాష్ట్రపతి రాంనాథ్ కోవింద్, కేంద్ర మంత్రులు, విపక్ష నేతలు హాజరయ్యారు. ఇటీవల జరిగిన ఉప రాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థిగా ధన్కర్ విజయం సాధించారు. కాంగ్రెస్ కూటమి అభ్యర్థి మార్గరేట్ ఆల్వా ఓటమి పాలయ్యారు.
రాజస్థాన్ నుంచి గతంలో ఉప రాష్ట్రపతిగా భైరాన్ సింగ్ షెకావత్ ఎన్నికయ్యారు. అదే రాజస్థాన్ నుంచి ధన్కర్ ఇప్పుడు ఎన్నికయ్యారు. గతంలో ధన్కర్ బెంగాల్ గవర్నర్ గా పనిచేశారు. ఉప రాష్ట్రపతి ఎన్నికల సందర్భంగా ఎన్డీయే తన అభ్యర్థిగా ధన్కర్ ను ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో ఆయనకు 710 ఓట్లలో 528 ఓట్లు లభించాయి. ఇక… ప్రతిపక్ష ఉమ్మడి అభ్యర్థిగా బరిలోకి దిగిన మార్గరేట్ ఆల్వా కు 182 ఓట్లు లభించాయి.
1951 మే 18న రాజస్థాన్‌లోని కితానా అనే మారుమూల గ్రామానికి చెందిన సాధారణ రైతు కుటుంబంలో జగదీప్ జన్మించారు. చిత్తోడ్ ఘఢ్ సైనిక్ స్కూల్‌లో ప్రాథమిక విద్య అభ్యసించిన ఆయన.. జైపూర్ రాజస్థాన్ యూనివర్సిటీ నుంచి ఎల్‌ఎల్‌బీ గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. జనతాదళ్ తరపు నుంచి 9వ లోక్‌సభ ఎన్నికల్లో ఝుంఝును స్థానం నుంచి జగదీప్ ధన్కర్ ఎంపీగా విజయం సాధించారు. 1993లో కిషన్ ఘడ్ అసెంబ్లీ స్థానం నుంచి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2003లో ఆయన బీజేపీలో చేరారు. 2019లో కేంద్రం జగదీప్ ను బెంగాల్ గవర్నర్ గా నియమించింది.
Delhi | President Droupadi Murmu administers the oath of office to Vice President-elect Jagdeep Dhankhar
Jagdeep Dhankhar becomes the 14th Vice President of India. pic.twitter.com/26m0SdZPXm
— ANI (@ANI) August 11, 2022