Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

జమ్మూ కశ్మీర్ లో 64 మంది కాంగ్రెస్ కు గుడ్ బై…. ఆజాద్ వెంటనే తామని ప్రకటన

జమ్మూ కశ్మీర్ లో కాంగ్రెస్ కు గట్టి ఎదురు దెబ్బ తగిలింది. కొన్ని రోజుల క్రిందటే సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పేశారు. ఇప్పుడు ఆజాద్ కు మద్దతుగా జమ్మూ కశ్మీర్ లో 64 మంది కాంగ్రెస్ నేతలు పార్టీకి గుడ్ బై చెప్పేశారు. ఆజాద్ కు మద్దతుగానే రాజీనామా చేస్తున్నామని వారు ప్రకటించారు. వారి రాజీనామా లేఖను కాంగ్రెస్ అధినేత్రి సోనియాకు పంపించారు. రాజీనామా చేసిన వారిలో మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీనియర్లు కూడా వున్నారు. ఇందులో ప్రత్యేకం ఏమిటంటే మాజీ డిప్యూటీ సీఎం తారాచంద్ కూడా వున్నారు. మనోలాల్ శర్మ, బల్వాన్ సింగ్, అబ్దుల్ మజిద్, ఝరు రామ్ తదితరులు రాజీనామా చేసిన వారిలో వున్నారు.

 

మరోవైపు కాంగ్రెస్ కు రాజీనామా చేసిన గులాంనబీ ఆజాద్ కొత్త ప్రాంతీయ పార్టీ స్థాపించనున్నారన్న ప్రచారం విపరీతంగా జరుగుతోంది. వచ్చే ఎన్నికల నాటికి జమ్మూ కశ్మీర్ లో తన పార్టీని స్థాపించనున్నారని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో తాజాగా రాజీనామా చేసిన నేతలందరూ ఆయన పార్టీలో చేరేందుకే కాంగ్రెస్ కు రాజీనామా చేసినట్లు ప్రచార జరుగుతోంది. జమ్ముకశ్మీర్ కాంగ్రెస్‌లో దాదాపు 95శాతం మంది కార్యకర్తలు తనవెంటే వస్తారని ఆజాద్ చెబుతున్నారు. పంచాయతీ, డీసీసీ సభ్యులు కూడా తన కొత్త పార్టీలో చేరుతారని పేర్కొన్నారు. ఆజాద్ కాంగ్రెస్‌కు రాజీనామా చేసిన తర్వాత చాలా మంది కశ్మీర్ కాంగ్రెస్ నేతలు పార్టీని వీడుతామని బహిరంగంగా ప్రకటించారు.

Related Posts

Latest News Updates