నిర్మాణ రంగ ఉత్పత్తుల తయారీ సంస్థ జేసీబీ ఇండియాకు కొత్త రథ సారధి నియమితులయ్యారు. మేనేజింగ్ డైరెక్టర్ (ఎండీ) మరియు చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈవో)గా సుభీర్ చౌదరీని ఎంపిక చేసినట్లు కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది. ప్రస్తుతం ఈయన జేసీబీ ఇండియా సీఓఓగా ఉన్నారు. 2005లో సుభీర్ చౌదరీ జేసీబీ ఇండియాలో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్గా జాయిన్ అయ్యారు. ప్రస్తుతం జేసీబీ ఇండియా మన దేశంలో పుణే, జైపూర్, న్యూ ఢిల్లీలో ఐదు ఫ్యాక్టరీలున్నాయి. గుజరాత్లో ఆరో ప్లాంట్ నిర్మాణంలో ఉంది. 2020 నాటికి ఇది అందుబాటులోకి వస్తుంది.