తెలంగాణ జర్నలిస్టులకు ఇండ్ల స్థలాల కేటాయింపు విషయంలో సానుకూల తీర్పు ఇచ్చిన సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణకు జర్నలిస్టు సంఘాల నాయకులు కృతజ్ఞతలు తెలిపారు. జస్టిస్ ఎన్‌వీ రమణ పుట్టినరోజు సందర్భంగా ఆయన నివాసంలో మీడియా అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ, ఎమ్మెల్యే చంటి క్రాంతి కిరణ్‌తో పాటు పలువురు నాయకులు కలిశారు. జస్టిస్ రమణను శాలువాతో సత్కరించి, జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామని ప్రెస్ అకాడమీ చైర్మన్ అల్లం నారాయణ స్పష్టం చేశారు. హౌజింగ్ సొసైటీ ఇళ్ల స్థలాల వ్యవహారంపై ఇచ్చిన తీర్పుతో జర్నలిస్టులకు న్యాయం చేశారంటూ ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీయూడబ్ల్యూజే ప్రధాన కార్యదర్శి మారుతీసాగర్, టీయూడబ్ల్యూజే రాష్ట్ర ప్రధాన కార్యదర్వి విరాహత్ అలీ, ఐజేయూ జాతీయ కార్యదర్వి నరేందర్ రెడ్డి, ఢల్లీి టీయూడబ్ల్యూజే కార్యవర్గ సభ్యులు ఉన్నారు.
