Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

సీఎం స్టాలిన్ చేతికి జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ రిపోర్టు

తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయ లలిత మరణంపై ఎన్నో అనుమానాలున్న విషయం తెలిసిందే. అయితే.. ఈ మధ్యే ఆమెకు సరైన చికిత్సే అందిందని సుప్రీం ఏర్పాటు చేసిన కమిటీ నిర్ధారించింది. తాజాగా… జయలలిత మరణంపై ప్రభుత్వం నియమించిన జస్టిస్ ఆరుముగస్వామి కమిషన్ రిపోర్టు కూడా సీఎం స్టాలిన్ చేతికి అందింది. జయలలిత మరణంపై తుది విచారణ నివేదికను తమిళనాడు సీఎం స్టాలిన్ కు జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ అందించింది. దాదాపు 600 పేజీల తుది నివేదిక సీఎం స్టాలిన్ కి అందించారు. జయలలిత మరణంపై అనేక అనుమాలు వ్యక్తమైన నేపథ్యంలో సీఎం స్టాలిన్ జస్టిస్ ఆరుముగ స్వామి కమిటీని నియమించారు. ఈ కమిటీకి ఎయిమ్స్ డాక్టర్ల ప్యానెల్ కూడా సహకరించింది. ఈ కమిషన్ పన్నీర్ సెల్వంతో పాటు మాజీ మంత్రులు.

 

 

జయలలిత బంధువులు, శశికళ బంధువులు, సెక్యూరిటీ గార్డులు, పోయెస్ గార్డెన్ సిబ్బంది, వైద్యం అందించిన సిబ్బందిని, ఐఏఎస్, ఐపీఎస్ లతో పాటు దాదాపు 158 మందిని ఈ జస్టిస్ ఆరుముగ స్వామి కమిషన్ విచారించింది. అయితే.. దాదాపు 600 పేజీల తుది నివేదికను ఇంగ్లీష్, తమిళం భాషల్లో రూపొందించారు. జయలలిత చికిత్స కోసం ఆస్పత్రిలో చేరే ముందు ఆరోగ్య పరిస్థితులు ఎలా వుండేవి? చేరిన తర్వాత ఆమె పరిస్థితులు మెరుగు కాకపోవడానికి కగల కారణం ఏమిటి ? విదేశాలుకు గనక చికిత్స నిమిత్తమై ఆమెను తీసుకెళ్తే… బతికేదా? అన్న ప్రశ్నలు ఆ కమిషన్ నివేదికలో వున్నాయి. మరోవైపు జస్టిస్ ఆర్ముగస్వామి కమిషన్ సమర్పించిన తుది నివేదికను తమిళనాడు అసెంబ్లీ క్షుణ్ణంగా చర్చించనున్నారు.

Related Posts

Latest News Updates