Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

కేజీఎఫ్2కు షాక్ ఇచ్చిన కాంతార‌! సెన్షేష‌న్ రికార్డ్‌ని బ్రేక్ చేసిన సంచలన చిత్రం!!

క‌న్న‌డ బాక్సాఫీస్ వ‌ద్ద కాంతార సినిమా సంచ‌ల‌నాలు సృష్టిస్తుంది. సైలెంట్‌గా రిలీజ్ అయిన ఈ సినిమా, బాక్సాఫీస్ వ‌ద్ద క‌లెక్ష‌న్లు కుమ్మేస్తుంది. ఈ క్ర‌మంలో 100 కోట్ల‌కు చేరువ అవుతోంది కాంతార‌. ఇక‌ హీరోగా అద్భుత‌మైన న‌ట‌న‌, ర‌చ‌యిత‌గా త‌న క‌లం బ‌లం, ద‌ర్శకుడిగా త‌న‌దైన మేకింగ్‌, మూడింటిని అద్భుతంగా బ్యాలెన్స్ చేయ‌డంలో రిష‌బ్ శెట్టి స‌క్సెస్ అయ్యారు. ఈ క్ర‌మంలో కాంతార బాక్సాఫీస్ రికార్డ్స్‌ను బ్రేక్ చేయ‌డ‌మే కాకుండా, అత్యంత ప్ర‌తిష్టాత్మ‌క రికార్డును కూడా బ్రేక్ చేసింది. క‌న్న‌డ‌లో సెన్షేష‌న్ హిట్ కొట్టిన కాంతార మూవీ పై అన్ని వైపుల నుంచి ప్ర‌శంస‌లు ద‌క్కుతున్నాయి. కాంతార అంటే మిస్టీరియ‌స్ ఫారెస్ట్ అని అర్థం. క‌న్న‌డ యంగ్ స్టార్ హీరో రిష‌బ్ శెట్టి నటించ‌డ‌మే కాకుండా ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన కాంతార చిత్రం సెప్టెంబ‌ర్ 30న రిలీజ్ అయ్యి బాక్సాఫీస్ వ‌ద్ద ప్ర‌భంజ‌నం సృష్టిస్తుంది. సామాన్యుడి నుంచి సెల‌బ్ర‌టీల వ‌ర‌కు ఈ సినిమాని చూసిన వాళ్ళు కాంతారా పై ప్ర‌శంస‌ల జల్లు కురిపిస్తూ సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతుండ‌డంతో ఈ మూవీ క్రేజ్ రోజురోజుకీ పెరుతుంది. ఇక కాంతార మూవీ రిలీజ్ అయిన రోజే, హేమా హేమీల‌తో జీనియ‌స్ డైరెక్ట‌ర్ మ‌ణిర‌త్నం తెర‌కెక్కించిన హిస్టారికల్ మూవీ పొన్నియిన్‌ సెల్వన్ లాంటి బ‌డా మూవీ విడుద‌లైనా, త‌ట్టుకుని నిల‌బ‌డ‌మే కాకుండా, శాండిల్ వుడ్ బాక్సాఫీస్ రికార్డ్స్ అన్నీ బ్రేక్ చేస్తుంది. రోజురోజుకీ ఈ సినిమాకి వ‌స్తున్న కేజ్‌ను క్యాష్ చేసుకునేందుకు ఇత‌ర భాష‌లు అంటే తెలుగు, త‌మిళ్ అండ్ హిందీలో డ‌బ్ చేసి విడుద‌ల చేయ‌నున్నారు. ఈ క్ర‌మంలో అక్టోబ‌ర్ 14న అంటే ఈ శుక్ర‌వార‌మే కాంతార హిందీలో రిలీజ్ కాగా, త‌మిళ్ అండ్ తెలుగులో అక్టోబ‌ర్ 15న రిలీజ్ అవుతుంది. ఇక వ‌సూళ్ళ ప‌రంగా చూసుకుంటే కాంతార ఇప్పటి వ‌ర‌కు వ‌ర‌ల్డ్ వైడ్‌గా 90 కోట్లు వ‌సూళ్ళు రాబ‌ట్టింద‌ని ట్రేడ్ వ‌ర్గాలు తెలిపాయి. ఇదే ఊపులో ఈవారం చివ‌రిక‌ల్లా కాంతార మూవీ 100 కోట్ల క్ల‌బ్‌లో చేర‌డం ఖాయ‌మ‌ని సినీ పండితులు అంచ‌నా వేస్తున్నారు.

ఒక్క కన్న‌డ రాష్ట్రంలోనే ఈ సినిమా దాదాపు 70 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వసూలు చేసిందంటే, ఆ సినిమా రేంజ్ ఏంటో తెలుస్తుంది. ఈ క్ర‌మంలో కాంతార మూవీ ప్ర‌తిష్టాత్మ‌క రికార్డును కూడా బ్రేక్ చేసి టాక్ అఫ్ ది ఇండ‌స్ట్రీ అయ్యింది. అస‌లు ముఖ్య‌మైన‌ మ్యాట‌ర్ ఏంటంటే.. ఇండియన్ సినిమా రేటింగ్స్ విష‌యంలో ఐఎండీబీ (ఇంటర్నెట్‌ మూవీ డేటాబేస్‌)ది ప్ర‌త్యేక స్థానం. ఏ సినిమాకి అయినా ఐఎండీబీలో ప‌ర్‌ఫెక్ట్ రేటింగ్ ఉంటుంది. ఇప్ప‌టి వ‌కు కేజీఎఫ్‌2 మూవీ ఐఎండీబీ రేటింగ్స్‌లో టాప్‌లో ఉంది.  IMDb లో కేజీఎఫ్‌2 రికార్డు 8.4గా ఉంది. అయితే ఇప్పుడు కేజీఎఫ్2 రికార్డును కాంతార బ్రేచ్ చేసి ఫ‌స్ట్ ప్లేస్‌లోకి వెళ్ళింది. ఈ క్ర‌మంలో IMDbలో కాంతార 9.4 రేటింగ్ ద‌క్కించుకున్న ఘ‌న‌త‌ను సాధించింది. ఎస్.ఎస్.రాజమౌళి బ్లాక్ బస్టర్ మూవీ RRRకు  IMDb లో 8.0 రేటింగ్ ఉంది. ఇకపోతే ఇటీవ‌ల కాంతార మూవీని చూసిన కోలీవుడ్ క్రేజీ స్టార్‌ హీరో ధనుష్, సోష‌ల్ మీడియాలో పెట్టిన పోస్ట్ వైర‌ల్‌గా మారింది. కాంతార సినిమా చూశాక త‌న మైండ్ బ్లాక్ అయ్యింద‌ని, అద్భుతంగా ఉంద‌ని, ప్ర‌తిఒక్క‌రు క‌చ్ఛితంగా చూడాల్సిన సినిమా అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా ఆ మూవీ హీరో అండ్ డైరెక్ట‌ర్ రిష‌బ్ శెట్టి గురించి మాట్లాడుతూ ఇలాంటి సినిమాని తెర‌కెక్కించిన నువ్వు గ‌ర్వ‌ప‌డాలి అంటూ ప్ర‌శంస‌లు కురిపించాడు. ఆ త‌ర్వాత హోంబ‌లే ఫిల్మ్స్ నిర్మాత‌ల‌కు అండ్ ఆ సినిమాకి ప‌ని చేసిన కాస్ట్ అండ్ టెక్నిక‌ల్ టీమ్‌కు శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తూ ధ‌నుష్ ట్వీట్ చేశాడు.

Related Posts

Latest News Updates