Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

హుబ్బలి ఈద్గా మైదానంలో గణేశ్ నవరాత్రులకు ఓకే చెప్పిన కర్నాటక హైకోర్టు

హుబ్బలి ఈద్గా మైదానంలో గణపతి నవరాత్రులు నిర్వహణకు కర్నాటక హైకోర్టు అనుమతినిచ్చింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా చూడాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఎప్పటి లాగా అక్కడ వినాయకుడిని ప్రతిష్ఠించి, శ్రద్ధాసక్తులతో పూజలు నిర్వహించారు. భక్తుల కోసం క్యూలైన్లను ఏర్పాటు చేశారు. హుబ్బుళ్లి ఈద్గా మైదానంలో గణేశుని వేడుకల కోసం నగర మున్సిపల్ కమిషన్ అనుమతించారు. కానీ దీనికి వ్యతిరేకంగా అంజుమన్ ఏ ఇస్లాం సంస్థ హైకోర్టుకు వెళ్లింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం.. ఈద్గా ఆస్తి ధార్వాడ్ మున్సిపాలిటీకి చెందిందని.. అంజుమన్ ఏ ఇస్లాం సంవత్సరానికి ఒక్క రూపాయి రుసుముతో 999 ఏళ్లకు గానూ లీజుదారుగా మాత్రమే ఉందన్నారు.

 

 

Related Posts

Latest News Updates