Telugu Abroad

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  teluguabroad.com@gmail.com 

అత్యంత ఖరీదైన ప్రాంతం ఖాన్‌ మార్కెట్‌

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన రిటైల్‌ ప్రాంతాల్లో ఢిల్లీలోని ఖాన్‌ మార్కెట్‌ 20వ స్థానంలో నిలిచింది. ఇక్కడ వార్షిక అద్దె చ.అ.కు రూ.17,445 (243 డాలర్లు)గా ఉంది. ఏడాది క్రితం ర్యాంకింగ్స్‌లో 21వ స్థానంలో నిలిచిన ఖాన్‌మార్కెట్‌ల్లో చ.అ.కు అద్దె ఏడాదికి రూ.17,014 (237 డాలర్లు)గా ఉందని గ్లోబల్‌ ప్రాపర్టీ కన్సల్టెంట్‌ కుష్‌మన్‌ వేక్‌ఫీల్డ్‌ తెలిపింది. తాజాగా ‘2019లో ప్రపంచంలోని ప్రధాన మార్కెట్‌ ప్రాంతాలు’ నివేదికను విడుదల చేసింది. 68 దేశాల్లో 448 ప్రాంతాల్లో సర్వే నిర్వహించించామని, ఈ ఏడాది రెండో త్రైమాసికంలో రిటైల్‌ అద్దెల ఆధారంగా ర్యాంక్‌లను కేటాయించామని కంపెనీ తెలిపింది.
కాస్‌వేబే లో చ.అ. అద్దె లక్షన్నర పైనే..
హ్యాంగ్‌కాంగ్‌లోని కాస్‌వే బే ప్రాంతం ప్రథమ స్థానంలో నిలిచింది. ఇక్కడ వార్షిక అద్దె చ.అ.కు రూ.1,97,070 (2,745 డాలర్లు)గా ఉంది. న్యూయార్క్‌లోని అప్పర్‌ ఫివ్త్‌ అవెన్యూ రెండో స్థానంలో, లండన్‌లోని న్యూబాండ్‌ స్ట్రీట్‌ మూడో స్థానంలో నిలిచాయి. ఫివ్త్‌ అవెన్యూలో చ.అ. అద్దె ఏడాదికి రూ.16,61,533 (2,250 డాలర్లు)గా, న్యూబాండ్‌ స్ట్రీట్‌లో చ.అ. అద్దె ఏడాదికి రూ.1,06,109 (1,478 డాలర్లు)గా ఉన్నాయి.
ఎఫ్‌ అండ్‌ బీ, దుస్తుల విభాగాల్లోనే..
ఇండియాలో గత ఏడాది కాలంగా అద్దెలు వృద్ధి చెందుతున్నాయి. షాపింగ్‌ మాల్స్‌లో స్పేస్‌ తక్కువగా అందుబాటులో ఉండటం, దేశ, విదేశీ బ్రాండ్స్‌ ఎంట్రీ ఇస్తుండటం, కమర్షియల్‌ కారిడార్లలోని మాల్స్‌లో మరింత డిమాండ్‌ ఉందని నివేదిక తెలిపింది. ముంబై, ఢిల్లీ–ఎన్‌సీఆర్, బెంగళూరులోని హైస్ట్రీట్‌ ప్రాంతాల్లో అద్దెలు స్వలంగా పెరిగితే.. చెన్నై, పుణే, కోల్‌కతా వంటి నగరాల్లో అద్దెలు మాత్రం రెట్టింపు స్థాయిలో వృద్ధి చెందాయని పేర్కొంది. ఫుడ్‌ అండ్‌ బేవరేజెస్‌ (ఎఫ్‌ అండ్‌ బీ), దుస్తులు, యాక్ససరేల విభాగాల్లో వృద్ధి అధికంగా ఉందని తెలిపింది. హైపర్‌ మార్కెట్లు, ఈ–కామర్స్‌ రిటైలర్లు ఆఫ్‌లైన్‌ స్టోర్లను ఏర్పాటు చేస్తుండటం ధరల వృద్ధికి కారణమని తెలిపారు.

Related Posts

Latest News Updates