Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

మునుగోడు ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్తా… ప్రియాంకతో భేటీ తర్వాత మనసు మార్చుకున్న కోమటిరెడ్డి

ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మెత్తబడ్డారు. మునుగోడు ప్రచారానికి వెళ్లే ప్రసక్తే లేదని భీష్మించుకు కూర్చున్న ఆయన… మాట మార్చారు. తాను మునుగోడు ఉప ఎన్నికల ప్రచారంలో పాల్గొంటానని ప్రకటించారు. అయితే.. పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రియాంక గాంధీతో భేటీ అయిన తర్వాత ఈ మాట చెప్పడం గమనించాల్సిన అంశం. పార్టీ ఎప్పుడు ప్రచారానికి పిలిచినా, వెళ్తానని, అభ్యర్థి ఎంపిక విషయంలో తన అభిప్రాయాన్ని పార్టీకి స్పష్టంగా చెబుతానని పేర్కొన్నారు. ఓ సారి ఢిల్లీకి రావాలంటూ ఎంపీ కోమటిరెడ్డికి అధిష్ఠానం నుంచి ఫోన్ వచ్చింది. దీంతో ఆయన ఢిల్లీకి వెళ్లి, పార్టీ అగ్రనేత ప్రియాంక గాంధీతో భేటీ అయ్యారు.

 

ఇక… మునుగోడు అభ్యర్థిని సర్వేల ద్వారా ఎంపిక చేస్తారని, ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంటుందని పేర్కొన్నారు. పార్టీకి ఎప్పుడు అవసరమైతే… అప్పుడే ప్రచారంలో పాల్గొంటానని కోమటిరెడ్డి పేర్కొన్నారు. మరో వైపు మునుగోడు ఉప ఎన్నిక అభ్యర్థిని అతి త్వరగా ప్రకటించాలని ప్రియాంక గాంధీ తెలంగాణ నేతలకు తేల్చి చెప్పారు. దీంతో… అభ్యర్థిని ఖరారు చేసేందుకు తెలంగాణ కాంగ్రెస్ నేతలు భట్టి విక్రమార్క, దామోదర్ రెడ్డి, పీసీసీ చీఫ్ రేవంత్, నల్గొండ జిల్లా అధ్యక్షుడితో పాటు పలువురు ప్రముఖులు సమావేశమయ్యారు. జానారెడ్డి, జీవన్ రెడ్డి కూడా హాజరయ్యారు. మరో వైపు మునుగోడు ఉప ఎన్నిక టిక్కెట్ పాల్వాయి స్రవంతికి దక్కిందని, అధిష్ఠానం ఆమోదం కోసం ఢిల్లీకి పంపారని సమాచారం.

Related Posts

Latest News Updates