దేశ వ్యాప్తంగా సిలిండర్ ధరలు పెరగడంపై తెలంగాణ ఐటీ మంత్రి కె. తారక రామారావు ట్విట్టర్ వేదికగా వ్యంగ్యాస్త్రాలు సంధించారు. అచ్ఛేదిన్ వచ్చాయి.. కంగ్రాట్స్.. అంటూ విమర్శలు చేశారు. గ్యాస్ ధరను మరోసారి పెంచి ప్రధాని నరేంద్ర మోదీ గిఫ్ట్ ఇచ్చారంటూ మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు.
సామాన్యుడిపై గ్యాస్ సిలిండర్ భారం మరోసారి పడింది. ఇంటి అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్ ధరను చమురు సంస్థలు మరోసారి పెంచాయి. 14.2 కేజీల సిలిండర్ ధరను 50 రూపాయల మేర పెంచుతున్నట్లు ప్రకటించాయి. దీంతో గ్యాస్ బండ రేటు 1100 దాటింది. ఈ నిర్ణయంతో సామాన్యుడిపై మరింత భారం పడినట్లైంది. ఇక.. ఈ బాదుడుతో హైదరాబాద్ నగరంలో రూ. 1055 ఉన్న సిలిండర్ ధర రూ.1105 కి పెరిగింది.
https://twitter.com/KTRTRS/status/1544519893529202688?s=20&t=GqkaH5d-4xbkVClWADgwNg