హఫీజ్‌పేట్ డివిజన్ పరిధిలోని కాయిదమ్మకుంట చెరువు కట్ట కబ్జాకు గురవుతుంది. చెరువు కట్టపై అక్రమంగా కొందరు వ్యక్తులు కట్టెల దుకాణం, వాహనాల పార్కింగ్ చేస్తున్నారు. దీంతో హఫీజ్‌పేట్ వాసులందరు చెరువు కబ్జాకు గురవుతుందని ఆందోళన చెందుతున్నారు. చెరువులను సంరక్షిస్తామంటున్న ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు కాయిదమ్మకుంట చెరువు కట్ట అక్రమాలు కనబడుడంలేదా అని ప్రశ్నిస్తున్నారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలోని చెరువులను సుందరీకరణ చేస్తున్న నేపద్యంలో హఫీజ్‌పేట్‌లోని కాయిదమ్మకుంట చెరువు అభివృద్ధిపై ఎందుకు చిన్న చూపు చూస్తున్నారని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. ఇప్పటికైన అధికారులు చెరువు కట్టపై అక్రమంగా ఏర్పాటు చేసిన కట్టెల దుకాణం, వాహనాల పార్కింగ్‌లను తొలగించి, చెరువు కట్ట చుట్టు ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలన్నారు.