Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘లైగర్’ కలెక్షన్స్ ఓపెనింగ్స్ అదుర్స్! సెకండ్ డే డ్రాప్స్

టాలీవుడ్ యువ హీరోలలో ఒకరు అయిన విజయ్ దేవరకొండ తాజాగా లైగర్ మూవీ లో హీరోగా నటించిన విషయం మన అందరికీ తెలిసిందే. ఈ మూవీ బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కింది. ఈ మూవీ లో అనన్య పాండే , విజయ్ దేవరకొండ సరసన హీరోయిన్ గా నటించగా , డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ఈ మూవీ కి దర్శకత్వం వహించాడు. ఈ మూవీ ని పూరి కనెక్ట్స్ , ధర్మ ప్రొడక్షన్స్ బ్యానర్ లపై పూరి జగన్నాథ్ మరియు కరన్ జోహార్.లు సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీ ఆగస్టు 25 వ తేదీన చాలా గ్రాండ్ గా ప్రపంచ వ్యాప్తంగా తెలుగు , తమిళ , హిందీ , కన్నడ , మలయాళ భాషలో విడుదల అయ్యింది. ఈ మూవీ కి విడుదల అయిన మొదటి రోజు మొదటి షో కే బాక్సా ఫీస్ దగ్గర నెగిటివ్ టాక్ లభించింది. దానితో మొదటి రోజు ఈ మూవీ కి అదిరిపోయే రేంజ్ ఓపెనింగ్ లభించినప్పటికీ రెండవ రోజు మాత్రం ఈ మూవీ కి చాలా వరకు కలెక్షన్ లు డ్రాప్ అయ్యాయి. మరి ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా రోజు వారిగా రెండు రోజుల్లో సాధించిన కలెక్షన్ ల వివరాలను తెలుసు కుందాం. మొదటి రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 13.45 కోట్ల షేర్ , 24.30 కోట్ల గ్రాస్ కలెక్షన్ లంజ వసూలు చేసింది. 2 వ రోజు లైగర్ మూవీ ప్రపంచ వ్యాప్తంగా 4.06 కోట్ల షేర్ , 9.20 కోట్ల గ్రాస్ కలెక్షన్ లను వసూలు చేసింది. ఇలా లైగర్ మూవీ కి మొదటి రోజుతో పోలిస్తే రెండవ రోజు కలెక్షన్ చాలా వరకు పడి పోయాయి. మరి రాబోయే రోజుల్లో ఈ మూవీ బాక్స్ ఆఫీస్ దగ్గర ఏ రేంజ్ కలెక్షన్ లను సాధిస్తుందో చూడాలి.

Related Posts

Latest News Updates