Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

‘మా’ వ్యతిరేకంగా ప్రవర్తిస్తే సభ్యత్వం డిలీట్ ! ‘మా’ సభ్యత్వ నిబంధనలు వెల్లడించిన విష్ణు

‘మా’ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన తరవాత సందర్భంగా మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విష్ణు అండ్ ఈ సి మెంబెర్స్  పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు.  మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యులకు సంబంధించిన నిబంధనల గురించి, కొత్తగా తీసుకున్న నిర్ణయాల గురించి అధ్యక్షుడు మంచు విష్ణు మీడియాకు వెల్లడించారు.  ఈ సందర్భంగా మంచు విష్ణు మాట్లాడుతూ.. ఈ ఏడాది కాలంలో తాము తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు.నటులు కానివారు చాలా మంది మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో సభ్యులుగా ఉన్నారని అధ్యక్షుడు మంచు విష్ణు అన్నారు. సుమారు 20 నుంచి 25 శాతం మంది నటులు కానివారు ‘మా’లో సభ్యులుగా ఉన్నారని వెల్లడించారు. గతంలో ఉన్న లొసుగుల ద్వారా వీరంతా ‘మా’ సభ్యులయ్యారని ఆరోపించారు. కానీ, ఈసారి మాత్రం ‘మా’ మెంబర్‌షిప్ చాలా కఠినతరం చేశామని చెప్పారు. నటులు మాత్రమే సభ్యులు కావాలని స్పష్టం చేశారు. ఈ మేరకు గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో మంచు విష్ణు వివరాలు వెల్లడించారు. తాను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఎన్నికై ఏడాది పూర్తయిన సందర్భంగా తన టీమ్‌తో కలిసి మంచు విష్ణు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంచు మోహన్ బాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా ‘మా’ సభ్యత్వం గురించి మంచు విష్ణు మాట్లాడుతూ.. ‘‘మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ కొత్త సభ్యత్వం నియమనిబంధనలను స్వర్గీయ కృష్ణంరాజు గారితో చర్చించి ఖరారు చేశాం. శాశ్వత సభ్యత్వం కావాలంటే ఒక హీరో కానీ, హీరోయిన్ కానీ కనీసం రెండు సినిమాల్లో నటించి ఉండాలి. ఆ రెండు సినిమాలు థియేటర్‌లో కానీ, ఓటీటీలో కానీ విడుదల అయ్యుండాలి. ఒక్క యూట్యూబ్‌ను మాత్రం మేం పరిగణనలోకి తీసుకోవడం లేదు. అదే క్యారెక్టర్ ఆర్టిస్ట్ అయితే.. కనీసం 10 సినిమాలు చేసుండాలి. ప్రతి సినిమాలో కనీసం 2 నిమిషాలు డైలాగులు ఉండాలి. అలాగే 5 నిమిషాలు సినిమాలో కనిపించాలి. అంతేకానీ, 10 నిమిషాలో అరగంటో హీరో వెనకాలో, విలన్ వెనకాలో నిలబడితే వారికి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ మెంబర్‌షిప్ రాదు’’ అని స్పష్టం చేశారు.ఈ నిబంధనలు కేవలం లైఫ్ మెంబర్‌షిప్ కోసమేనని.. అసోసియేట్ మెంబర్‌గా ఎవరైనా అవ్వొచ్చని విష్ణు వెల్లడించారు. గతంలో దీన్ని టెంపరరీ మెంబర్‌షిప్ అనేవారని.. ఆ మాట తీసేసి అసోసియేట్ మెంబర్‌గా తీసుకుంటున్నామని చెప్పారు. ఇక, లైఫ్ మెంబర్లుగా చేరినవారికి వెంటనే ఓటు హక్కు రాదని.. ఐదేళ్లు లైఫ్ మెంబర్‌షిప్‌ను పూర్తిచేసుకున్న సభ్యులకు మాత్రమే ఓటు హక్కు వస్తుందని స్పష్టం చేశారు. అయితే, అసోసియేట్ మెంబర్లకు మాత్రం ఓటు హక్కు అనేది ఉండదని చెప్పారు. లైఫ్ మెంబర్ అయినవారికి ఉచిత ఆరోగ్య బీమా ఉంటుందని.. అసోసియేట్ మెంబర్‌కు మాత్రం ఈ సదుపాయం ఉండదని వెల్లడించారు. అసోసియేట్ మెంబర్స్ డబ్బులు కట్టి తమ వద్ద ఉన్న మంచి స్కీముల్లో హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకోవచ్చని సూచించారు. అయితే, లైఫ్ ఇన్సూరెన్స్ మాత్రం లైఫ్ మెంబర్స్, అసోసియేట్ మెంబర్స్ ఇద్దరికీ ఉచితంగా ఇస్తున్నామన్నారు.ఈ క్రమంలో మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో తీసుకుంటున్న క్రమశిక్షణా చర్యల గురించి కూడా మంచు విష్ణు వివరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వ్యతిరేకంగా ఎవరైనా మీడియాకు ఎక్కినా, ధర్నాలు చేసినా ఆ సభ్యులకు అన్ని బెనిఫిట్స్ పోతాయని.. ఈసీ నిర్ణయం తీసుకుంటే సభ్యత్వమే పోతుందని మంచు విష్ణు హెచ్చరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనేది ఒక కుటుంబమని.. ఈ కుటుంబంలో తమకు ఏమైనా ఇబ్బందులు వస్తే అంతర్గతంగా తామే సరిదిద్దుకుంటామని, అలాకాకుండా బయటకు వెళ్లి అల్లరి చేస్తే తక్షణమే తరిమేస్తామని విష్ణు కుండబద్దలుకొట్టారు. అలాగే, సినీ పరిశ్రమలో ఏమైనా ఇబ్బందులు ఎదురైనప్పుడు నేరుగా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌కు వస్తే తాము సాయం చేస్తామని.. అలాకాకుండా ముందు మీడియాకు వెళ్లి ఆ తరవాత ‘మా’ దగ్గరకు వస్తే తాము ఎంకరేజ్ చేయమని విష్ణు స్పష్టం చేశారు. తమ చట్టంలో ఈ మార్పులన్నీ తీసుకొచ్చామని చెప్పారు. లైఫ్ మెంబర్‌గా ఐదేళ్లు పూర్తిచేసుకున్న సభ్యులు మాత్రమే ‘మా’ ఎన్నికల్లో పోటీ చేయడానికి వీలుందని విష్ణు తెలిపారు.

మానిఫెస్టోలో ప్రకటించిన వాగ్దానాల్లో 90 శాతం పూర్తి చేశామని చెప్పారు. ఈ ఏడాది కాలంలో తాము తీసుకున్న నిర్ణయాల గురించి వివరించారు. మహిళల సంరక్షణ, సాధికారతకు తాము పెద్దపీట వేస్తున్నామన్నారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల్లో తాము ప్రకటించిన మ్యానిఫెస్టోలోని వాగ్దానాలను 90 శాతం పూర్తిచేశామని ‘మా’ అధ్యక్షుడు మంచు విష్ణు వెల్లడించారు. మంచు విష్ణు సారథ్యంలోని గవర్నింగ్ బాడీ ఏడాది పాలన పూర్తిచేసుకున్న సందర్భంగా విష్ణు అండ్ టీమ్ గురువారం మీడియా ముందుకు వచ్చారు. ఈ కార్యక్రమానికి మోహన్ బాబు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ మీడియా సమావేశంలో మంచు విష్ణు.. తాము ఈ ఏడాది కాలంలో చేసిన పనుల గురించి వివరించారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ బిల్డింగ్ నిర్మాణం మినహా మ్యానిఫెస్టోలోని వాగ్దాలను 90 శాతం పూర్తిచేశామని విష్ణు వెల్లడించారు.
ప్రతి ఒక్కరికీ అవకాశం
తాను ‘మా’ అధ్యక్షుడిగా గెలిస్తే ప్రతి ఒక్కరికీ అవకాశాలు ఇప్పిస్తానని ఆరోజు వాగ్దానం చేశానని.. ఆ అవకాశాల కోసం తామొక పుస్తకాన్ని ప్రచురించామని విష్ణు చెప్పారు. మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో ఉన్న నటులందరితో ఈ పుస్తకాన్ని ప్రచురించి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్‌తో పాటు ప్రస్తుతం యాక్టివ్‌గా ఉన్న ప్రతి నిర్మాతకు ఇచ్చామన్నారు. నటుడు గౌతంరాజు ఆధ్వర్యంలో ఈ పుస్తకం ప్రింటింగ్ జరిగిందన్నారు. ప్రస్తుతం ‘మా’లో ఉద్యోగావకాశాలకు ఆయనే ఇన్‌ఛార్జ్ అని విష్ణు వెల్లడించారు. ప్రతి ప్రొడక్షన్ కంపెనీ దగ్గరకు గౌతంరాజు స్వయంగా వెళ్లి ఈ పుస్తకాన్ని ఇచ్చారని తెలిపారు. ఈ పుస్తకం ప్రింట్ చేయడం వల్ల ఇప్పటికే 10 మందికి అవకాశాలు వచ్చాయని చెప్పారు.
సోషల్ మీడియా యాప్
‘మా’ సభ్యుల కోసం సోషల్ మీడియా యాప్ సిద్ధం చేస్తున్నామని మంచు విష్ణు చెప్పారు. సంక్రాంతి తరవాత ఈ యాప్‌ను రిలీజ్ చేస్తామన్నారు. ప్రతి ఒక్క ప్రొడక్షన్ హౌస్‌కి ఈ సోషల్ మీడియా యాప్ యాక్సిస్ ఉంటుందని.. కొత్తగా వచ్చే నటీనటులు సైతం ఈ యాప్‌లో ఉంటారని విష్ణు వెల్లడించారు. ఏఏ నిర్మాణ సంస్థలు ఏఏ సినిమాలను ప్రారంభిస్తున్నాయి.. వాటిలో అవకాశాలు ఏంటి.. ఎవరికి కాంటాక్ట్ చేయాలి వంటి సమాచారం మొత్తం ఈ యాప్‌లో ఉంటుందని విష్ణు వివరించారు. ఇలాంటి విధానం భారతదేశంలో ఏ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లో లేదని విష్ణు అన్నారు.
మహిళల సంరక్షణ
మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్‌లోని మహిళ సంరక్షణ, సాధికారత కోసం కూడా చర్యలు తీసుకున్నామని విష్ణు చెప్పారు. ‘మా’ ఎప్పుడూ ఆడపడుచులకు అండగా ఉంటుందని చెప్పిన విష్ణు.. వారి కోసం ఒక హై-పవర్ కమిటీని తయారుచేశామన్నారు. పద్మశ్రీ అవార్డు గ్రహీత సునీతాకృష్ణన్‌ను సలహాదారుగా ఒక కమిటీని ఏర్పాటుచేసి మహిళల సమస్యలు వారికి తెలిపే ఏర్పాటు చేశామన్నారు. షూటింగ్‌లలో, ఇతరాత్ర పరిస్థితుల్లో మహిళా ఆర్టిస్టులకు ఎలాంటి ఇబ్బందులు కలిగినా వారికి ఈ కమిటీ అండగా ఉంటుందన్నారు.

Related Posts

Latest News Updates