Prapancha Telugu

Latest Telugu News & information portal for Indians & NRI’s  

For more information contact :  info@prapanchatelugu.com

చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి మండలి వెంకట కృష్ణారావు సంస్మృతి పురస్కారం

మాజీ మంత్రి మండలి వెంకట కృష్ణారావు సంస్మృతి పురస్కారాల ప్రదానోత్సవం ఈ నెల 26 న హైదరాబాద్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయంలో జరగనుంది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ హాజరు కానున్నారు. ఇక.. శుక్రవారం ఉదయం 10 గంటలకు జరిగే ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా యూనివర్శిటీ వీసీ ప్రొఫెసర్ తంగెడ కిషన్ రావు, ఆత్మీయ అతిథిగా మండలి బుద్ధ ప్రసాద్ హాజరవుతున్నారు.

 

మరోవైపు వెంకట కృష్ణారావు సంస్మృతి పురస్కారం 2022 ను చెన్నై నగరంలో వుండే ప్రసిద్ధ శస్త్ర చికిత్స నిపుణుడు, డాక్టర్ బీసీ రాయ్ అవార్డు గ్రహీత ఆచార్య చిల్లకూరు ముద్దు కృష్ణారెడ్డికి అందజేయనున్నారు.గత 50 సంవత్సరాలుగా తమిళనాట తెలుగు వారికి పెద్ద దిక్కుగా వుంటున్నారు. అంతేకాకుండా అఖిల భారత తెలుగు సమాఖ్యను స్థాపించి తమిళనాడులో తెలుగు భాషను కాపాడేందుకు నిరంతరం ప్రయత్నిస్తున్నారు.

 

Related Posts

Latest News Updates